వరల్డ్‌కప్ 2019: పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకపోతే నష్టం ఎంత?


హైదరాబాద్: భారత్-పాక్ మ్యాచ్ అంటే చాలు... ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిని కనబరుస్తారు. ఇక, ఆ మ్యాచ్ వరల్డ్‌కప్‌లో జరుగుతుంటే చెప్పాల్సిన పనిలేదు. ఇరుదేశాలకు చెందిన అభిమానులు భావోద్వేగానికి లోనవుతారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వరల్డ్ కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని కొందరు క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ వేదికగా జూన్ 16న మాంచెస్టర్‌లోని ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బీసీసీఐ సైతం భారత ప్రభుత్వం పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని ఆదేశిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడుతామని తేల్చి చెప్పింది.

భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగపోతే
అయితే, వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగపోతే కలిగే నష్టం గురించి ఆలోచిస్తే దిమ్మదిరగాల్సిందే. గతంలో భారత్-పాక్ మ్యాచ్ ప్రసార హక్కుల్ని దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్‌ని కుదించడం వల్ల పెద్ద మొత్తంలో నష్టపోయింది. ఇంగ్లాండ్ వేదికగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మ్యాచ్‌ని వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించారు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో 4 ఓవర్లు తగ్గించడం వల్ల
రెండు ఇన్నింగ్స్‌ల్లో 4 ఓవర్లు తగ్గించడం వల్ల తమకు రూ.10 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రసారదారు స్టార్ ఇండియా ప్రకటించింది. ఇక, ఆస్ట్రేలియాలో జరిగిన 2015 వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏకంగా 29 కోట్ల మంది చూసినట్లు అంచనా. ఈ మ్యాచ్ ద్వారా రూ.110 కోట్ల ఆదాయం వచ్చింది.

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పటివరకు భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది లేదు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌కి ఆదాయం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదు. పుల్వామా ఉగ్రదాడి నేఫథ్యంలో ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో మ్యాచ్ రెండు జట్లకు, అభిమానులకు మరింత ప్రతిష్టాత్మకం అవుతుంది.

భారత్-పాక్ మ్యాచ్‌పై అభిమానులు ఆసక్తి
దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. కాబట్టి ఈ మ్యాచ్ ఆదాయం రూ.200 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. ఇక, పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకపోతే పాక్ ఖాతాలో ఆయాచితంగా రెండు పాయింట్లు చేరతాయి. ఇరు జట్ల అంగీకారంతో మ్యాచ్ రద్దయితే పాయింట్లు సమంగా పంచుతారు.

1996 వరల్డ్‌కప్ సమయంలో
కానీ ఒక జట్టు మరో జట్టుతో మ్యాచ్ కాదనుకుంటే అవతలి జట్టే గెలిచినట్లు లెక్కేస్తారు. 1996 వరల్డ్‌కప్ సమయంలో శ్రీలంకలో పరిస్థితులు బాగా లేకపోవడంతో అక్కడ మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. దీంతో శ్రీలంక ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. అంతేకాదు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన శ్రీలంక జట్టు విశ్వవిజేతగా కూడా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications