న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జింగ్ బెయిల్స్ వివాదం: టోర్నీ మధ్యలో మార్చలేమన్న ఐసీసీ

ICC Cricket World Cup 2019 : ICC Refuses To Change LED Bails Mid-Tournament || Oneindia Telugu
ICC World Cup 2019: ICC refuses to change LED bails mid-tournament

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో వివాదాస్పదంగా మారిన జింగ్‌ బెయిల్స్‌ను మార్చే ప్రసక్తి లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తేల్చి చెప్పింది. మెగాటోర్నీ మధ్యలో ఎలాంటి మార్పులు చేయబోమని.. ఏదేమైనా అందరూ అవి వాడాల్సిందేనని స్పష్టం చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

"గత వరల్డ్‌కప్ నుంచి అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇవే బెయిల్స్ వినియోగిస్తున్నాం. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు తలెత్తుతోంది. అదంతా ఆటలో భాగమే. టోర్నీ మధ్యలో మార్పులు చేయం. అన్ని జట్లు అదే సరంజామతో ఆడుతున్నాయి" అని ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

వికెట్లను తాకినా ఎల్‌ఈడీ బెయిల్స్‌

వికెట్లను తాకినా ఎల్‌ఈడీ బెయిల్స్‌

ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే పలు మ్యాచ్‌ల్లో బౌలర్‌ వేసిన బంతులు వికెట్లను తాకినా ఎల్‌ఈడీ బెయిల్స్‌ మాత్రం కింద పడక పోవడంపై సర్వత్రా చర్చ జరగుతున్నది. దీంతో నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటించడానికి వీలుండదు. దీనిపై భారత్‌, ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లు ఎల్‌ఈడీ బెయిల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో

బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో

టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో బంతి లెగ్‌ స్టంప్‌ వికెట్లను బలంగా తాకినా బెయిల్స్‌ పడకపోవడంతో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ ఆరంభంలోనే ఔట్ కాకుండా తప్పించుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో అతడు హాఫ్ సెంచరీతో చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

బెయిల్స్ మధ్యలో వైర్లు అమర్చడం వల్ల

బెయిల్స్ మధ్యలో వైర్లు అమర్చడం వల్ల

దీంతో లైట్లు వెలిగేందుకు వీలుగా బెయిల్స్ మధ్యలో వైర్లు అమర్చడం వల్ల బరువు పెరిగి బెయిల్స్ పడటం లేదనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు పది సందర్భాల్లో బెయిల్స్‌ ఇలా కింద పడకుండా బ్యాట్స్‌మెన్‌ను ఆదుకున్న సందర్భాలను అభిమానులు చూశారు.

గురువారం కివీస్‌తో మ్యాచ్

గురువారం కివీస్‌తో మ్యాచ్

ఈ నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అనతంరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కాగా, టోర్నీలో భాగంగా కోహ్లీసేన గురువారం వరుసగా మూడు విజయాలను నమోదు చేసిన న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Story first published: Wednesday, June 12, 2019, 9:34 [IST]
Other articles published on Jun 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X