చాలా బాధపడ్డా, ధావన్‌కు బ్యాకప్‌గా ఇంగ్లాండ్‌కు: చాహల్ టీవీతో పంత్ (వీడియో)

హైదరాబాద్: ప్రపంచకప్ కోసం తొలుత ప్రకటించిన జాబితాలో తన పేరులేనందున చాలా బాధపడ్డాడని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం అవడంతో రిషబ్ పంత్‌ను బ్యాకప్ ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు పిలిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ధావన్ పూర్తిగా వరల్డ్‌కప్ మొత్తానికి దూరమయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అతడి స్థానంలో పంత్ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా టీమిండియా శనివారం పసికూన ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ శుక్రవారం చాహల్ టీవికి ఇంటర్యూ ఇచ్చాడు. ప్రపంచకప్‌నకు ఎంపిక కాకపోవడంతో మరింత సానుకూలంగా మారిపోయానని... తనను తాను మెరుగు పరుచుకొనేందుకు ఆటపై ఎంతో దృష్టిపెట్టానని వెల్లడించాడు.

ప్రపంచకప్‌నకు ఎంపిక కాకపోవడంతో
"ప్రపంచకప్‌నకు ఎంపిక కాకపోవడంతో నేనేదో సరిగ్గా చేయలేదని అనుకున్నా. అప్పుడు నేను మరింత సానుకూలంగా మారిపోయా. నన్ను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించా. ఆ తర్వాత ఐపీఎల్‌లో రాణించా. నిరంతరం సాధన చేస్తూనే ఉన్నా. భారత్ గెలవాలన్నది ప్రతి ఒక్కరి కల. ధావన్‌కు బ్యాకప్‌గా ఇంగ్లాండ్‌కు వెళ్లాలని బీసీసీఐ నుంచి ఫోన్ వచ్చింది" అని అన్నాడు.
అప్పుడు అమ్మ నా పక్కనే ఉంది
"అప్పుడు అమ్మ నా పక్కనే ఉంది. మా అమ్మకు విషయం చెప్పగానే ఆమె గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించింది. దేశం తరుపున ఆడే అవకాశం వచ్చింది, మంచిగా ఆడు అని చెప్పింది. శిఖి భాయ్(శిఖర్ ధావన్) గాయం కారణంగా దూరమవడం చాలా బాధ కలిగించింది. ప్రస్తుతం మా అందరిదీ ఓకే కల. ప్రపంచకప్‌ను టీమిండియా గెలవాలి అందులో మా పాత్ర ఉండాలి అని" అని పంత్ తెలిపాడు.

ఇప్పుడు గెలవాలనే పట్టుదలతో ఉన్నా
"అందుకు తగ్గట్లే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఒక క్రికెటర్‌గా ప్రపంచకప్ ఆడాలని నేనెప్పుడూ కోరుకున్నా. నాకు ఆ అవకాశం వచ్చింది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు గెలవాలనే పట్టుదలతో ఉన్నా. అవకాశం వస్తే జట్టు కోసం తన వంతు పాత్ర పోషిస్తా" అని రిషబ్ పంత్ తెలిపాడు. టీమిండియా శనివారం ఆప్ఘనిస్థాన్ జట్టుతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications