న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్పెషల్స్: వరల్డ్‌కప్‌లో పాల్గొనే 10 జట్ల అత్యధిక స్కోరెంతో తెలుసా?

ICC World Cup 2019: Highest ODI totals of all participating teams

హైదరాబాద్: ఎవరినోట విన్నా ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ గురించే. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

వరల్డ్‌కప్‌లో పాల్గొనే 10 జట్ల అత్యధిక స్కోర్లును ఒక్కసారి పరిశీలిద్దాం...

ఇంగ్లాండ్ - 481/6

ఇంగ్లాండ్ - 481/6

ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా ఆస్ట్రేలియాతో జూన్ 19, 2018న జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ వన్డేల్లో అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ 147, జానీ బెయిర్ స్టో 139 పరుగులతో రాణించడంతో ఇంగ్లాండ్ 481 పరుగులు చేసింది. తద్వారా వన్డేల్లో 475 పరుగుల మార్కుని దాటిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. అనంతరం 482 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 239 పరుగులకే ఆలౌటైంది.

శ్రీలంక - 443/9

శ్రీలంక - 443/9

అమస్టీల్వెన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జులై 4, 2006న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక వన్డేల్లో అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సనత్ జయసూర్య 157, తిలకరత్నే దిల్షాన్ 117 సెంచరీలతో మెరవడంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 443 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 248 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో శ్రీలంక 195 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దక్షిణాఫ్రికా - 439/2

దక్షిణాఫ్రికా - 439/2

జోహెన్స్‌బర్గ్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఏబీ డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో సెంచరీ సాధించిన డివిలియర్స్ 44 బంతుల్లో 149 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఆమ్లా, రైలీ రోసోవూ సెంచరీలతో మెరవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 439 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండిస్ 291 పరుగులే చేయడంతో సఫారీలు 148 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఆస్ట్రేలియా - 434/4

ఆస్ట్రేలియా - 434/4

జోహెన్స్‌బర్గ్ వేదికగా మార్చి 12, 2006న దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వన్డేల్లో అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ మాజీ గ్రేట్ రికీ పాంటింగ్ 105 బంతుల్లో 164 పరుగులు చేయగా... ఆడమ్ గిల్ క్రిస్ట్, మైక్ హస్సీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయితే, ఛేధనలో సఫారీ బ్యాట్స్‌మన్ గిబ్స్(175) సెంచరీతో చెలరేగడంతో పాటు కెప్టెన్ గ్రేమ్ స్మిత్(90) పరుగులతో రాణించడంతో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

ఇండియా - 418/5

ఇండియా - 418/5

ఇండోర్ వేదికగా డిసెంబర్ 8, 2011లో వెస్టిండిస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో టీమిండియా అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ 149 బంతుల్లో 7 సిక్సులు, 25 ఫోర్ల సాయంతో 219 పరుగులు చేశాడు. అనంతరం చేధనలో వెస్టిండిస్ 265 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండియా 153 పరుగుల తేడాతో విజయం సాధించింది.

న్యూజిలాండ్ - 402/2

న్యూజిలాండ్ - 402/2

అబెర్డీన్ వేదికగా ఐర్లాండ్‌తో జులై 1, 2008లో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు బ్రెండన్ మెక్‌కల్లమ్ (135 బంతుల్లో 166), జేమ్స్ మార్షల్(141 బంతుల్లో 161) సెంచరీలతో చేలరేగారు. అనంతరం చేధనలో ఐర్లాండ్ 112 పరుగులకే ఆలౌట్ కావడంతో న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో విజయం సాధించింది.

పాకిస్థాన్ - 399/1

పాకిస్థాన్ - 399/1

బులవాయో వేదికగా జులై 20, 2108న జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఫకార్ జమాన్ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఫకార్ జమాన్ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 210 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్ షాదబ్ ఖాన్ 28/4 సూపర్ స్పెల్ దెబ్బకు పాకిస్థాన్ 244 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వెస్టండిస్ - 389/10

వెస్టండిస్ - 389/10

గ్రెనెడా వేదికగా ఫిబ్రవరి 27, 2019న ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ వన్డేల్లో అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 418/6 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో జోస్ బట్లర్ (77 బంతుల్లో 150), ఇయాన్ మోర్గాన్(88 బంతుల్లో 103) సెంచరీలతో చెలరేగారు. లక్ష్య చేధనలో వెస్టిండిస్ 389 పరుగులు చేసిన ఆలౌటైంది. వెస్టిండిస్ జట్టులో క్రిస్ గేల్(97 బంతుల్లో 162), బ్రావో(59 బంతుల్లో 61) చెలరేగినప్పటికీ విండిస్‌ను గెలిపించలేకపోయారు.

ఆప్ఘనిస్థాన్ - 338/10

ఆప్ఘనిస్థాన్ - 338/10

గ్రేటర్ నోయిడా వేదికగా ఐర్లాండ్‌తో మార్చి 17, 2107న జరిగిన ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ వన్డేల్లో అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఆప్ఘన్ జట్టు తరుపున కెప్టెన్ ఆప్ఘర్ ఆప్ఘన్ సెంచరీని నమోదు చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఆప్ఘనిస్థాన్ 338 పరుగులు చేసింది. చేధనలో ఐర్లాండ్ గట్టిగానే పోరాడినప్పటికీ రషీద్ ఖాన్ 43/6 సూపర్ స్పెల్ దెబ్బకు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌ ఆప్గనిస్తాన్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బంగ్లాదేశ్ - 329/6

బంగ్లాదేశ్ - 329/6

మిర్‌పుర్ వేదికగా ఏప్రిల్ 17, 2015న పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వన్డేల్లో అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తరుపున తమీమ్ ఇక్బాల్(135 బంతుల్లో 132), ముష్పికర్ రహీమ్(77 బంతుల్లో 106) సెంచరీలతో మెరిశారు. చేధనలో పాకిస్థాన్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోవడంతో 79 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Story first published: Wednesday, May 22, 2019, 16:36 [IST]
Other articles published on May 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X