వరల్డ్‌కప్: 'తుది జట్టులో చోటు... నా చేతుల్లో లేదు'

హైదరాబాద్: వరల్డ్‌కప్ తుది జట్టులో చోటు దక్కడం అనేది తన చేతుల్లో లేదని దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ హషీమ్ ఆమ్లా చెప్పాడు. వరల్డ్‌కప్‌కు ముందు శ్రీలంక, వెస్టిండిస్‌లతో జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో ఆమ్లా వరుసగా హాఫ్ సెంచరీలతో రాణించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దక్షిణాఫ్రికా తుది జట్టులో ఆమ్లా చోటు
దీంతో వరల్డ్‌కప్‌లో ఆడబోయే దక్షిణాఫ్రికా తుది జట్టులో ఆమ్లా చోటు దక్కించుకుంటాడో లేదో అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమ్లా మాట్లాడుతూ "తుది జట్టులో నేనుంటానా లేదా అనే దానికంటే మ్యాచ్‌లో పరుగులు చేయడం చాలా ముఖ్యం. జట్టు కోసం నా వల్ల అయ్యేది చేస్తాను" అని అన్నాడు.

దేశవాళీ టీ20 టోర్నీలో ఆడకపోవడంపై
దేశవాళీ టీ20 టోర్నీలో ఆడకపోవడంపై కూడా ఆమ్లా స్పందించాడు. వరల్డ్ కప్‌కు ముందు బ్యాటింగ్ కోచ్ డాలె బెన్‌కెన్‌స్టీన్‌తో రెండు వారాలపాటు ఆమ్లా నెట్ ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే. "50 ఓవర్ల క్రికెట్‌తో పోలిస్తే టీ20 భిన్నంగా ఉంటుంది. వరల్డ్ కప్‌కు ముందు బ్యాటింగ్ కోచ్ డాలె బెన్‌కెన్‌స్టీన్‌తో రెండు వారాలపాటు ఆమ్లా నెట్ ప్రాక్టీస్ చేశా. ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు ఆడొచ్చు, ఆడలేకనూ పోవచ్చు" అని అన్నాడు.

బహుశా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావొచ్చు!
ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత సీనియర్ ఆటగాడిగా ఉన్న హషీమ్ ఆమ్లా తన అనుభవం గురించి స్పందిస్తూ "మ్యాచ్‌లు ఆడేటప్పుడు అది సహజంగానే జరుగుతుంది. దాని గురించి నేనెప్పుడూ అనాలోచితంగానే ఆలోచిస్తా. తుది జట్టులో ఆడబోయే జట్టుకి మంచి అనుభవమే ఉంటుంది. కోచింగ్ టీమ్ సరైన సమయంలో విలువైన సమాచారం చేరవేస్తారు" అని తెలిపాడు.

వరుసగా రెండు హాఫ్ సెంచరీలు
శ్రీలంక, వెస్టిండీస్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 65, 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కాగా, గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోన్న హషీమ్ ఆమ్లా వార్మప్ మ్యాచ్‌లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications