వరల్డ్‌కప్ సెమీపైనల్‌కు చేరే నాలుగు జట్లేవో చెప్పేసిన హర్భజన్

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా మరో రెండు వారాల్లో ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో సెమీపైనల్‌కు చేరే నాలుగు జట్ల పేర్లను టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. ఇంగ్లీష్ పిచ్‌లు, అక్కడి పరిస్థితులు, ప్రస్తుతం ఫామ్ ఆధారంగా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీపైనల్‌కు చేరుకుంటాయని భజ్జీ తెలిపాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
తన అంచనా ప్రకారం పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరదని స్పష్టం చేసిన హర్భజన్ సింగ్... దక్షిణాఫ్రికా కూడా లీగ్‌లోనే ఇంటి ముఖం పడుతుందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ "ఇప్పటివరకు ప్రపంచకప్ గెలవకున్నా.. మెగాటోర్నీల్లో కివీస్ అద్భుతంగా ఆడుతుంది. ప్రస్తుతం ఆ జట్టులోని యువ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు" అని హర్భజన్ అన్నాడు.

వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీల్లో
"వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీల్లో ఇదే తేడాని కనబరుస్తుంది. ఇక, సమతుల్యంగా ఉన్న టీమిండియా వరల్డ్‌కప్ సెమీస్‌కు తప్పక చేరుకుంది. స్వదేశంలో ఆడనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం దీంతో ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుతుంది. ఆసీస్ గురించి చెప్పక్కర్లేదు. ఇక, నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్‌కే నా ఓటు. పాక్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరవు" అని భజ్జీ తెలిపాడు.

దక్షిణాఫ్రికా 3వ ర్యాంకులో
ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా 3వ ర్యాంకులో కొనసాగుతుండగా... న్యజిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో సెమీపైనల్స్ మ్యాచ్‌లు జులై 9, 11న జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకు ఓల్డ్ ట్రాఫోర్డ్, ఎడ్జిబాస్టన్ వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి.

లార్డ్స్‌లో వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్
ఇక, జులై 14న జరగనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ వేదికకానుంది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. కాగా, 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.

మే30 నుంచి జులై 14వరకు
మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications