న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది నాకు మోస్ట్ ఛాలెంజింగ్ వరల్డ్‌కప్: వరల్డ్‌కప్ సన్నద్ధతపై కోహ్లీ

ICC Cricket World Cup 2019 : Virat Kohli Says 'Handling Pressure The Most Important Thing'
ICC World Cup 2019: Handling pressure the most important thing, says Virat Kohli

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని ఎదుర్కోవడం అత్యంత ముఖ్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం ఇంగ్లాండ్‌కు పయనం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ సన్నద్ధతపై మంగళవారం కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి వివరాలు వెల్లడించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది తొలి వరల్డ్‌కప్. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ఈ వరల్డ్‌కప్ ఛాలెంజింగ్ వరల్డ్‌కప్. టోర్నీలో పాల్గొనే ఏ జట్టైనా మిగతా జట్టుపై గెలవొచ్చు. ఇంగ్లాండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి. ఈ వరల్డ్‌కప్‌లో అన్ని రకాల స్కోర్లను అంచనా వేస్తున్నాం. కొన్ని మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది" అని కోహ్లీ అన్నాడు.

ఇదొక ఛాలెంజ్ లాంటింది

"ఇదొక ఛాలెంజ్ లాంటింది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఐపీఎల్ తర్వాత ప్రతి ఒక్కరికీ సమయం దొరికింది. ఆటగాళ్లు మళ్లీ తిరిగి కలవాల్సిన సమయం ఆసన్నమైంది. పుట్‌బాల్ ఆటగాడు ప్రీమియర్ లీగ్, లాలిగా లాంటి టోర్నీల్లో ఎలాగైతే మూడు లేదా నాలుగు నెలలు పాటు తీవ్రతను కొనసాగిస్తాడో... అలానే వరల్డ్‌కప్‌లో మేమంతా అదే తీవ్రతను కొనసాగిస్తాం" అని కోహ్లీ తెలిపాడు.

జట్టంతా ఆటపై ఫోకస్ పెట్టింది

"ఈ వరల్డ్‌కప్‌లో జట్టంతా ఆటపై ఫోకస్ పెట్టింది. అసలు ప్రత్యర్ధి ఎవరనేది ఆలోచన చేయడం లేదు. ఈ వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని ఎదుర్కోవడం అత్యంత ముఖ్యం. మా బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్ ఆడటం వల్ల అలసిపోలేదు" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మెగా టోర్నీలో ఆటను ఎంజాయ్ చేస్తే కప్పు మనదేనని కోహ్లీ అన్నాడు.

బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ లాంటి జట్లు కూడా బలమైనవే

వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ లాంటి జట్లు కూడా బలమైనవేనని కోహ్లీ అన్నాడు. వరల్డ్‌కప్ క్యాంపెయిన్‌కు ముందు టీమిండియా న్యూజిలాండ్(మే 25), బంగ్లాదేశ్‌(మే 28)న రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. ఇక, టోర్నీలో భాగంగా జూన్ 5న దక్షిణాప్రికాతో కోహ్లీసేన తన తొలి మ్యాచ్‌ని ఆడనుంది.

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఐదోసారి

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఐదోసారి

వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.

లార్డ్స్‌లో వరల్డ్‌కప్ పైనల్ మ్యాచ్

లార్డ్స్‌లో వరల్డ్‌కప్ పైనల్ మ్యాచ్

డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Tuesday, May 21, 2019, 18:33 [IST]
Other articles published on May 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X