Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీని 'మోడ్రన్ డే జీసస్‌'గా అభివర్ణించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

ICC World Cup 2019: Graeme Swann admires Virat Kohli as ‘A modern day Jesus’

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 'మోడ్రన్ డే జీసస్'గా అభివర్ణించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్. ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్ కాకున్నా పెవిలియన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ విషయమై తాజాగా గ్రేమ్ స్వాన్ మాట్లాడుతూ "ఔటైనా అంఫైర్ నిర్ణయం వచ్చే వరకు క్రీజులో ఉండే బ్యాట్స్‌మెన్ అంటే నాకు నచ్చరు. అలాంటి వారితో ఎన్నో సార్లు గొడవపడ్డాను. ఔట్ అని తెలిసినా... చూద్దాం అంఫైర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అని చీటింగ్ చేస్తుంటారు" అని చెప్పుకొచ్చాడు.

"ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరే ఛీట్ చేసుకుంటున్నట్లు. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం వెనక్కి తిరిగిచూడకుండా పెవిలియన్‌కు చేరాడు. అతడు ఎంతో నిజాయితీతో వ్యవహరించాడు. అతడు నాటౌట్ కాకపోయినా... ఔట్ అని క్రీజు వదిలాడు. నిజాయితీగా చెప్పాలంటే కోహ్లీ మోడ్రన్ డే జీసస్" అని కొనియాడాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

టీమిండియా 46.4 ఓవర్లకు గాను 305/4 ఉన్న స్థితిలో వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు. వర్షం వెలిసిన తర్వాత విరాట్‌ కోహ్లీ, విజయ్‌ శంకర్‌ తిరిగి క్రీజులోకి వచ్చారు. ఇన్నింగ్స్ 48 ఓవర్‌ను పాక్ పేసర్ మహ్మద్‌ ఆమీర్‌ అందుకున్నాడు. తొలి బంతికి విజయ్‌ శంకర్‌ పరుగులేమీ తీయకపోగా, రెండో బంతికి సింగిల్‌ తీశాడు.

స్టైకింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ

స్టైకింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ

దీంతో స్టైకింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక, ఆమిర్‌ వేసిన నాలుగో బంతిని బౌన్సర్‌గా సంధించడంతో క్రీజులో ఉన్న కోహ్లీ పుల్‌ చేయబోగా అది కీపర్‌ చేతుల్లో పడింది. దీనిపై ఔట్‌కు సర్ఫరాజ్‌ బలంగా అప్పీల్‌ చేయకపోయినా, అంపైర్‌ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లీ వెంటనే తలవంచుకొని పెవిలియన్‌ వైపు బయల్దేరాడు.

కోహ్లీ బ్యాట్‌ బంతి తాకనే లేదు

కోహ్లీ బ్యాట్‌ బంతి తాకనే లేదు

అంపైర్‌ ఔట్‌గా కూడా ప్రకటించలేదు. రీప్లే చూస్తే కోహ్లీ బ్యాట్‌ బంతి తాకనే లేదని తేలింది. బ్యాట్‌ హ్యాండిల్‌ కాస్త వదులవడం వల్ల శబ్దం వచ్చి విరాట్ కోహ్లీ తాను ఔట్‌ అని భ్రమపడినట్లు తేలింది. పెవిలియన్‌కు చేరాక రీప్లే చూసుకుని విరాట్‌ కోహ్లీ అసహనం చెందడం మనకు కనిపించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి(77) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.

89 పరుగుల తేడాతో భారత్ విజయం

89 పరుగుల తేడాతో భారత్ విజయం

ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 244 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు భారత జట్టులో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, June 25, 2019, 16:43 [IST]
Other articles published on Jun 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+