Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లీషు గడ్డపై వరల్డ్‌కప్‌ గెలిచేదెవరు చెప్పేసిన మెక్‌గ్రాత్

ICC World Cup 2019: Glenn McGrath picks India and England as favourites

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్‌కప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ అన్నాడు. ఈ రెండు జట్లకు ఉన్న బౌలింగ్ వల్లే వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకం కాబోతుందని పేర్కొన్నాడు.

ఫేవరేట్లుగా భారత్, ఇంగ్లాండ్

ఫేవరేట్లుగా భారత్, ఇంగ్లాండ్

"వరల్డ్‌కప్‌‌లో భారత్, ఇంగ్లండ్ జట్లే ఫేవరేట్లు. విండీస్‌లో ఇంగ్లండ్ చాలా కష్టాలు పడింది. భారత్.. ఆసీస్ చేతిలో ఓడింది. కానీ ఇప్పుడు ఈ రెండు జట్లకే మెరుగైన అవకాశాలున్నాయి. మిగతా జట్ల నుంచి కూడా పోటీ ఉంటుంది. భారత్‌పై టీ20, వన్డే సిరీస్ గెలిచిన కంగారూల జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. వార్నర్, స్మిత్ రాకతో జట్టు మరింత బలోపేతమవుతుంది" అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు

పేస్‌ బౌలింగ్‌లో ఎలాంటి బలహీనత లేదు

పేస్‌ బౌలింగ్‌లో ఎలాంటి బలహీనత లేదు

టీమిండియా పేస్‌ బౌలింగ్‌లో ఎలాంటి బలహీనత లేదని, పేసర్లు వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్‌గా ఉండటం ముఖ్యమని మెక్‌గ్రాత్‌ అన్నాడు. "టీమిండియా పేస్‌ ఎటాక్ అద్భుతం. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్ పర్యటనలో భారత పేసర్లు అద్భుతాలు చేశారు. కచ్చితమైన వేగంతో నిలకడగా బంతులు వేయడం ఆశ్చర్యానికి గురి చేసింది" అని మెక్‌గ్రాత్ అన్నాడు.

బౌలర్లందరూ ఫిట్‌గా ఉండటం అవసరం

బౌలర్లందరూ ఫిట్‌గా ఉండటం అవసరం

"వరల్డ్‌కప్ సమయానికి బౌలర్లందరూ ఫిట్‌గా ఉండటం అవసరం. ఇషాంత్ చాలా అనుభవజ్ఞుడు. భువీ కూడా రాటుదేలాడు. షమీ వేగం సూపర్బ్. వీళ్లందరికంటే బుమ్రా నన్ను చాలా ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌కు అతడు సన్నద్ధమయ్యే తీరు.. ఆట పట్ల అతడు ప్రదర్శించే దృక్పథం గొప్పగా ఉంటుంది. బుమ్రా వేగం, యార్కర్లు సంధించే తీరు వెలకట్టలేనిది" అని మెక్‌గ్రాత్ చెప్పాడు.

భువీ స్వింగ్‌ బౌలర్‌

భువీ స్వింగ్‌ బౌలర్‌

"భువనేశ్వర్‌ స్వింగ్‌ బౌలర్‌. తెలివిగా బౌలింగ్‌ చేస్తాడు. ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలు.. భువీ, బుమ్రాలు రాణించడంపైనే ఆధారపడివుంటాయి. బౌలర్లందరూ ఇదే తీరులో చెలరేగితే ప్రపంచకప్ గెలువడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు" అని మెక్‌గ్రాత్ వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కెరీర్ ముగిసిన తర్వాత లారా, సచిన్ మాదిరిగా గుర్తు పెట్టుకుంటారని మెక్‌గ్రాత్ అన్నాడు.

Story first published: Friday, March 22, 2019, 12:10 [IST]
Other articles published on Mar 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+