'అదనపు బాధ్యతను పాండ్యా చిరునవ్వుతో స్వీకరిస్తాడు'

హైదరాబాద్: టీమిండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టులో ఎలాంటి అదనపు బాధ్యత అప్పగించినా పాండ్యా చిరునవ్వుతో స్వీకరిస్తాడని కేఎల్ రాహుల్ తెలిపాడు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో దిగిన కేఎల్ రాహుల్ సెంచరీ బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కేఎల్ రాహుల్ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ "ఫాస్ట్ బౌలర్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య జట్టు కూర్పులో కీలక పాత్ర పోషిస్తాడు. ఫార్మాట్‌తో పాండ్యాకు సంబంధం లేదు. పాండ్యాకు ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆ ప్రతిభను ఉపయోగించి ఈ రెండేళ్లలో అతడు ఎంతగానో ఎదిగాడు" అని కేఎల్ రాహుల్ అన్నాడు.

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు
కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహారించిన కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే, నిషేధం ముగిసిన తర్వాత వీరిద్దరి పునరాగమనం అద్భుతంగా ఉంది. వీరిద్దరూ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

దక్షిణాఫ్రికాపై కేప్‌టౌన్‌లో 90 పరుగులు
ఇక, వరల్డ్‌కప్ టోర్నీ గురించి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ "ఎరుపు బంతి క్రికెట్‌లో అతడి ఫామ్ చూశారు కదా. ఇంగ్లాండ్‌లో కూడా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దక్షిణాఫ్రికాపై కేప్‌టౌన్‌లో 90 పరుగులు చేశాడు. ఒత్తిడిలో కూడా జట్టుకు భారీ స్కోరు అందించాడు. జట్టు మేనేజ్‌మెంట్ ఎక్కువగా ఆశలు పెట్టుకొనే ఆటగాళ్లలో పాండ్యా ఒకడు" అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

చిరునవ్వుతో ఎలాంటి పాత్రనైనా
"పాండ్యా తనకు ఇచ్చిన బాధ్యతను స్వీకరిస్తాడు. పాండ్యాకు ఏ పాత్రనైనా ఇవ్వండి చిరునవ్వుతో దానిని పోషిస్తాడు. జట్టుకు ఉపయోగపడాలనే అతడి పోరాటం గొప్పది. మైదానంలోకి దిగిన ప్రతిసారీ 100 శాతం నిబద్ధతతో పనిచేస్తాడు" అని కేఎల్ రాహుల్ తెలిపాడు. టోర్నీలో భాగంగా కోహ్లీసేన జూన్ 5న సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications