Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్ జట్టులో అదొక్కటే లోపం: గౌతమ్ గంభీర్

ICC World Cup 2019: Gautam Gambhir points out what’s missing in India’s squad

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం సెలక్టర్లు ప్రకటించిన జట్టు... 2011 వరల్డ్‌కప్ జట్టు కన్నా బాగుందని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ జట్టులో ఏదైనా లోటు ఉందంటే, అది బౌలింగ్‌ విభాగంలోనేనని చెప్పుకొచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇంగ్లాండ్ పిచ్‌లకు అనుగుణంగా నలుగురు పేసర్లను ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

జట్టులో ఎదైనా లొపించిందంటే

జట్టులో ఎదైనా లొపించిందంటే

"జట్టులో ఎదైనా లొపించిందని భావిస్తే అది నాలుగో సీమర్‌ లేకపోవడమే. ఇది పెద్ద టోర్నీ మాత్రమే కాదు సుదీర్ఘమైనది. ప్రస్తుతం జట్టులో ముగ్గురు సీమర్లు ఉన్నారు. హార్ధిక్, విజయ్‌లు ఆల్ రౌండర్లు. అందుకే నేను నాలుగో సీమర్‌గా నవదీప్‌ షైనీని ఎంపిక చేశాను. ఎందుకంటే ఇంగ్లండ్‌ పరిస్థితులకు దగ్గట్లు ముగ్గరు పేసర్లకు బ్యాకప్‌గా నాలుగో సీమర్‌ ఉండాలి" అని గంభీర్ అన్నాడు.

వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులో

వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులో

వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీల రూపంలో ముగ్గులు పేసర్లు ఉన్నారు. మరోవైపు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. 2011, 2015 వరల్డ్‌కప్ జట్లతో పోలిస్తే ప్రస్తుత జట్టు మాత్రం బలంగా ఉందని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత బౌలింగ్‌ అటాక్‌ అద్భుతం

ప్రస్తుత బౌలింగ్‌ అటాక్‌ అద్భుతం

"అప్పటి బౌలింగ్‌ అటాక్‌ కన్నా ప్రస్తుత బౌలింగ్‌ అటాక్‌ అద్భుతంగా ఉంది. గణంకాలు లెక్కించడం, పోల్చడం నాకు ఇష్టం ఉండదు. 2011తో పోలిస్తే 2015 భిన్నం. ఇప్పుడు 2015తో పోలిస్తే 2019 ఇంకా భిన్నం. ప్రస్తుత జట్టుకు వరల్డ్‌‌కప్ నెగ్గే సత్తా ఉంది. అంతేకాదు 2011, 2015 వరల్డ్‌కప్ జట్లలోని బౌలింగ్ ఎటాక్‌తో పోలిస్తే 2019 వరల్డ్‌కప్ జట్టులో అత్యుత్తమం" అని గంభీర్ అన్నాడు.

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వరల్డ్‌కప్ ఆరంభం

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వరల్డ్‌కప్ ఆరంభం

కాగా, ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన జట్టులో అంబటి రాయుడికి చోటు లభించకపోవడం తనను గుండె పగిలేంత బాధకు గురి చేసిందని ఇటీవలే గౌతమ్ గంభీర్ అన్న సంగతి తెలిసిందే. కేవలం మూడు ఫెల్యూయిర్స్ కారణంగా అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా బాధాకరమని చెప్పాడు.

రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడంపై

రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడంపై

గంభీర్ మాట్లాడుతూ "రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడంపై చర్చించాల్సిన అవసరం లేదు... అంబటి రాయడి గురించి చర్చించాలి. వైట్ బాల్ క్రికెట్‌లో 48 యావరేజి, 33 ఏళ్ల వయసున్న క్రికెటర్‌ను వదిలేయడం చాలాచాలా దురదృష్టకరం. మిగతా సెలక్షన్‌ నిర్ణయాలతో పోలిస్తే నాకైతే ఇది గుండెపగిలేంత బాధగా అనిపిస్తోంది" అని అన్నాడు.

Story first published: Thursday, April 18, 2019, 14:45 [IST]
Other articles published on Apr 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+