ప్రపంచకప్: విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ICC Cricket World Cup 2019 Final : Do You Know How Much The Prize Money The Winners Got ? | Oneindia
 ICC World Cup 2019: Full list of awards, prize money and statistics

హైదరాబాద్: టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగి అంచనాలు నిలబెట్టుకుంటూ, ఆశలను నిజం చేసుకుంటూ ఆతిథ్య ఇంగ్లాండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. లార్డ్స్ వేదికగా ఆదివారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చివరకు ఇంగ్లాండ్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు తీయగా... జోఫ్రా అర్చర్, మార్క్ వుడ్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది.

అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు 'టై'గా ముగియడంతో ఆతిథ్య జట్టు అత్యధిక బౌండరీలు సాధించడంతో ఇంగ్లాండ్‌‌ను విశ్వ విజేతగా ప్రకటించారు. విశ్వవిజేతగా నిలిచిన జట్టు రూ. 28 కోట్ల ప్రైజ్ మనీని అందుకోగా... రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 14 కోట్ల ప్రైజ్ మనీని అందుకుంది.

ప్రపంచకప్ పూర్తి అవార్డుల జాబితాతో పాటు ప్రైజ్ మనీ వివరాలు:

ప్రైజ్ మనీ

ప్రైజ్ మనీ

ఛాంపియన్ - ఇంగ్లాండ్: రూ. 20 కోట్లు

రన్నరప్ - న్యూజిలాండ్: రూ. 14 కోట్లు

సెమీఫైనలిస్ట్‌లు - ఇండియా, ఆస్ట్రేలియా: రూ. 5.6 కోట్లు

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్

కేన్ విలియమ్సన్: (578 runs; Average - 82.57, 100s - 2, 50s - 2, Best - 148, MoM - 2)

1992 Martin Crowe

1996 Sanath Jayasuriya

1999 Lance Klusener

2003 Sachin Tendulkar

2007 Glenn McGrath

2011 Yuvraj Singh

2015 Mitchell Starc

2019 Kane Williamson

ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

బెన్ స్టోక్స్: 84 నాటౌట్

1975 Clive Lloyd

1979 Viv Richards

1983 Mohinder Amarnath

1987 David Boon

1992 Wasim Akram

1996 Aravinda de Silva

1999 Shane Warne

2003 Ricky Ponting

2007 Adam Gilchrist

2011 MS Dhoni

2015 James Faulkner

2019 Ben Stokes

బ్యాటింగ్ రికార్డులు

బ్యాటింగ్ రికార్డులు

అత్యధిక స్కోరు - రోహిత్ శర్మ(648 పరుగులు)

మొత్తం సెంచరీలు - 31

300కుపైగా పరుగులు - 26 సార్లు

అత్యధిక వ్యక్తిగత స్కోరు - డేవిడ్ వార్నర్(166 పరుగులు)

జట్టు చేసిన అత్యధిక స్కోరు - ఇంగ్లాండ్ 397/6

మొత్తం సిక్సులు - 22 - ఇయాన్ మోర్గాన్

మొత్తం ఫోర్లు - 67 - రోహిత్, జానీ బెయిర్ స్టో

బెస్ట్ యావరేజి - 86.57 - షకీబ్ ఉల్ హాసన్

అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు - రోహిత్ శర్మ(5 సెంచరీలు - వరుసగా మూడు సెంచరీలు)

అత్యధిక హాఫ్ సెంచరీలు - షకీబ్ ఉల్ హాసన్ (7 హాఫ్ సెంచరీలు)

అత్యధక బంతులను ఎదుర్కొన్న ఆటగాడు - కేన్ విలియమ్సన్(771 బంతులు)

బౌలింగ్ రికార్డులు

బౌలింగ్ రికార్డులు

అత్యధిక వికెట్లు - మిచెల్ స్టార్క్ - 27

బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ - షహీన్ అఫ్రిది - 6/39

బెస్ట్ బౌలింగ్ యావరేజి(4 మ్యాచ్‍‌లు) - మహ్మద్ షమీ - 13.79

అత్యధిక మెయిడిన్ ఓవర్లు - జస్ప్రీత్ బుమ్రా - 9 ఓవర్లు

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 15, 2019, 12:44 [IST]
Other articles published on Jul 15, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more