27 ఏళ్ల తర్వాత సెమీస్‌లో ఓడిన ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ వివరణ

హైదరాబాద్: ఓ చెత్త ప్రదర్శనతో ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించడం బాధ కలిగిస్తోందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆవేదన వ్యక్తం చేశాడు. టోర్నీలో భాగంగా గురువారం ఎడ్జిబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీపైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగుని ఆస్ట్రేలియా తొలిసారి ఓ సెమీస్ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించడంపై మ్యాచ్ అనంతరం ఆరోన్ ఫించ్ మీడియాతో మాట్లాడాడు.

గేమ్‌లో మొదటి 10 ఓవర్లు ఎంతో కీలకం
"గేమ్‌లో మొదటి 10 ఓవర్లు ఎంతో కీలకం. కొత్త బంతి సీమ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు గ్రేట్ లెంత్‌తో స్టంప్స్‌ను తాకుతుంది. ఈ క్యాంపెయిన్‌లో ఎన్నో పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత ఏడాది పాటు మా ప్రయాణం కష్టంగా సాగింది. అయితే ఆటగాళ్లు మానసికంగా చాలా పరిపక్వతను ప్రదర్శించారు" అని ఫించ్ వెల్లడించాడు.

లీగ్ దశలో చాంపియన్ ఆటను ప్రదర్శించాం
"తిరిగి గాడిలో పడి ప్రపంచకప్‌లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగాం. లీగ్ దశలో చాంపియన్ ఆటను ప్రదర్శించాం. ట్రోఫీని నెగ్గాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మా అంచనాలు తలకిందులు అయ్యాయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో చెలరేగుతుందని అనుకున్నాం. కానీ, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి మమల్ని షాక్‌కు గురిచేసింది" అని ఆరోన్ ఫించ్ అన్నాడు

చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించాం
"క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్‌లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్మిత్, క్యారీల పోరాటం అద్భుతం. ఇంగ్లాండ్‌పై మేము అన్ని రంగాల్లో విఫలమయ్యాం. ఆర్చర్‌కు మంచి భవిష్యత్ ఉంది. చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించడం బాధ కలిగించింది. ఈ ఓటమి ప్రభావం యాషెస్ సిరీస్‌పై ఉండదని భావిస్తున్నా" అని ఫించ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications