Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్: టాస్ నెగ్గిన బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ బ్యాటింగ్

ICC World Cup 2019, England vs Bangladesh Live Score: Unchanged Bangladesh bowl against England

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. కార్డిఫ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్ రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జో రూట్‌, జోస్ బట్లర్‌ సెంచరీలతో చెలరేగినా ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు మొదటి మ్యాచ్‌లో అదే సఫారీలను ఓడించిన బంగ్లా రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడింది. గత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోయే ఇంగ్లాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈసారి లెక్కను సమం చేయాలని మోర్గాన్‌ సేన భావిస్తోంది.

ముఖాముఖిగా ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 వన్డేలు జరగ్గా 16 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచింది. నాలుగింటిలో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై బంగ్లా మెరుగైన రికార్డుని కలిగి ఉంది. మెగా టోర్నీలో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లాడగా... రెండింటి (2011, 15)లో బంగ్లాదేశ్, ఒకదాంట్లో (2007) ఇంగ్లాండ్‌ గెలిచింది.


జట్ల వివరాలు:

ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, లియాం ప్లంకెట్, జోప్రా ఆర్చర్, మార్క్ ఉడ్

బంగ్లాదేశ్: తమీమ్ ఇక్బాల్(కెప్టెన్), సౌమ్య సర్కార్, షకీబ్ ఉల్ హాసన్, ముష్ఫికర్ రెహ్మాన్, మహ్మద్ మిథున్, మహ్మదుల్లా, మొసద్దిక్ హొస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహదీ హాసన్, మష్రఫె మొర్తాజా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

{headtohead_cricket_2_10}

Story first published: Saturday, June 8, 2019, 15:09 [IST]
Other articles published on Jun 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+