పబ్‌జీ గేమ్ ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆన్‌లైన్ 'పబ్‌జీ' గేమ్ యువతను విపరీతంగా ఆకర్షించింది. ఇక భారత్‌లో అయితే ఈ పిచ్చి మరీ ఎక్కువగా ఉంది. యువతను ఎక్కడ చూసినా.. నిద్ర, ఆహరం మాని ఈ గేమ్ ఆడుతూ కనిపిస్తున్నారు. యువతను అంతగా ఆకట్టుకున్న ఈ ఆన్‌లైన్ గేమ్ టీమిండియా ఆటగాళ్లను కూడా వదల్లేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
మ్యాచ్, ప్రయాణ సమయంలో కొద్దిగా ఖాళీ సమయం దొరికితే చాలు ఆటగాళ్లు ఈ గేమ్ ఆడుతున్నారు. ప్రపంచకప్ కోసం బుధవారం తెల్లవారుజామున ఇంగ్లాండ్ విమానం ఎక్కేందుకు సమయం ఉండటంతో జట్టులోని కొంతమంది ఆటగాళ్లు సరదాగా పబ్‌జీ గేమ్‌ను ఆడుతూ కనిపించారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. స్పిన్నర్ చాహల్.. పేసర్లు మహ్మద్ షమీ, భువనేశ్వర్‌లు పబ్‌జీ గేమ్ ఆడారు.
ఈ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు తమదైన కామెంట్లు కురిపిస్తున్నారు. 'ప్రపంచకప్ ఒకవైపు.. పబ్‌జీ గేమ్ మరోవైపు' అని ఓ అభిమాని ట్వీటాడు. 'ఓ.. ధోనీ, చహల్ పబ్‌జీ ఆడుతున్నారు', 'ధోనీ పబ్‌జీ గేమ్‌లో మాస్టారే', 'ధోనీ పబ్‌జీ గేమ్‌లో కూడా సహచరులకు సూచనలు ఇస్తున్నాడు' అని అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రపంచకప్ జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications