Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్‌పై ధోని పులిలా విరుచుకుపడతాడు

ICC World Cup 2019: ‘Dhoni can go smashing,’ England’s top performer makes huge prediction about former India captain

హైదరాబాద్: టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఇంగ్లాండ్ బౌలర్ లియాం ప్లంకెట్ మద్దతుగా నిలిచాడు. ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్ అనంతరం ప్లంకెట్ మీడియాతో మాట్లాడుతూ "అద్భుతమైన విజయం. ఫైనల్ మ్యాచ్‌లా ఒత్తిడిని ఎదుర్కొన్నాం. ఈ మ్యాచ్‌లో టాస్ ఎంతో కీలకం. మైదానం మొత్తం అభిమానులతో నిండిది. భారత అభిమానులకు క్రికెట్ అంటే పిచ్చి. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మాదిరి ఇంగ్లాండ్‌లో కూడా అభిమానులను చూడటం సంతోషంగా ఉంది" అని అన్నాడు.

ఇంగ్లాండ్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, జేసన్ రాయ్‌‌లను భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. "వారిద్దరూ అచ్చం బెయిర్‌స్టో, జేసన్‌రాయ్‌లా ఆడారు. ఈ మ్యాచ్‌లో మాకు చక్కటి ఆరంభం లభించింది. మ్యాచ్ జరుగుతున్న కొద్ది కొత్త బంతితో ఆడటం కష్టం" అని ప్లంకెట్ అన్నాడు.

బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో ధోని చెలరేగుతాడని ప్లంకెట్ చెప్పుకొచ్చాడు. "ధోనీ వంటి ఆటగాడిని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు. గత మూడు మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయిన ధోనీ ఆకలితో ఉన్నాడు" అని ప్లంకెట్ అన్నాడు. ఇక, న్యూజిలాండ్‌తో ఆడబోయే ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌ చేరతామని ఇంగ్లాండ్‌ బౌలర్‌ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే, బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేదార్ స్ధానంలో దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

మరోవైపు బంగ్లాదేశ్ కూడా రెండు మార్పులు చేసింది. మహ్మదుల్లా, మిర్జ్ స్థానాల్లో రూబెల్ హుస్సేన్, షబ్బీర్ రెహ్మాన్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు ఇది 200వ వన్డే కావడం విశేషం. టీమిండియా ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే 13 పాయింట్లతో భారత్ సెమీస్‌ చేరుతుంది.

Story first published: Tuesday, July 2, 2019, 16:07 [IST]
Other articles published on Jul 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+