For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్: అరుదైన రికార్డు నెలకొల్పిన క్రిస్ గేల్

ICC World Cup 2019: Chris Gayle has now hit more sixes than anyone in Cricket World Cup history

హైదరాబాద్: నాటింగ్‌ హామ్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో వెస్టిండిస్ విధ్వంసకర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ విండిస్ బౌలర్ల దెబ్బకు 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుని నమోదు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అనంతరం 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టులో క్రిస్ గేల్ బౌండరీలతో చెలరేగుతున్నాడు. తద్వారా వరల్డ్‌కప్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 37 సిక్సులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ రికార్డుని గేల్ అధిగమించాడు. పాక్ బౌలర్ హసన్ బౌలింగ్‌లో రెండు సిక్సులతో ఈ ఘనత అందుకున్నాడు.

1
43645

{headtohead_cricket_5_8}

వరల్డ్‌కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు వీరే:

38* - క్రిస్‌గేల్ (వెస్టిండిస్)
37 - ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
31 - రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
29 - బ్రెండన్ మెక్‌కలమ్(న్యూజిలాండ్)
28 - గిబ్స్ (దక్షిణాఫ్రికా)
27 - సనత్ జయసూర్య(శ్రీలంక)/ సచిన్ టెండూల్కర్ (ఇండియా)

Story first published: Friday, May 31, 2019, 18:15 [IST]
Other articles published on May 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+