న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. వెస్టిండీస్‌ వైస్‌ కెప్టెన్‌గా క్రిస్‌ గేల్‌

ICC Cricket World Cup 2019 : Chris Gayle Appointed Vice-Captain Of Windies World Cup Team | Oneindia
ICC World Cup 2019: Chris Gayle Appointed Vice-Captain Of Windies World Cup Team

ఐపీఎల్ సీజన్-12లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌ అద్భుతంగా ఆడాడు. ఫలితంగా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పుడు ఏకంగా వెస్టిండీస్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఈ మేరకు విండీస్‌ క్రికెట్‌ బోర్డు ట్విట్టర్ వేదికగా తెలిపింది. గేల్ చివరి సారిగా 2010 జూన్‌లో విండీస్‌ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

విండీస్ కెప్టెన్‌గా జాస‌న్ హోల్డ‌ర్ ఉన్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం విండీస్ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న షై హోప్‌ను కాదని గేల్‌ను నియమించడం విశేషం. క్రిస్‌ గేల్‌ వెస్టిండీస్‌ తరపున 289 వన్డేలలో 10,151 పరుగులు చేసాడు. వన్డేలలో గేల్‌ అత్యధిక స్కోర్ 215. ఈ సోరును గేల్‌ 2015 ప్రపంచకప్‌లో జింబాంబ్వేపై నమోదు చేసాడు. ప్రపంచకప్‌ విండీస్ ప్రస్తుత జట్టులో గేల్‌ అత్యంత అనుభవజ్ఞుడు. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ మే 31న పాకిస్థాన్‌తో తలపడనుంది.

'ఏ ఫార్మాట్లోనైనా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. అందులోనూ ప్రపంచకప్‌ ప్రత్యేకమైనది. ఒక సీనియర్‌ ప్లేయర్‌గా కెప్టెన్‌తో పాటు సహచర ఆటగాళ్లకు సహకారం, మద్దతుగా నిలవడనం నా బాధ్యత. ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీలో అంచనాలు భారీగానే ఉంటాయి, వెస్టిండీస్‌ ప్రజల కోసం మేము అందరం అత్యుత్తమ ప్రదర్శన చేయాలి' అని గేల్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, May 9, 2019, 14:20 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X