
లారా మాట్లాడుతూ
క్రిక్ బజ్‌కు ఇచ్చిన ఇంటర్యూలో లారా మాట్లాడుతూ "టీమిండియా విశ్వవిజేతగా అవతరిస్తే ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విభిన్న పరిస్థితుల్లో ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. కోహ్లీసేన సమతూకంలో ఉంది. వరల్డ్ కప్ ట్రోఫీని నెగ్గే సత్తా కూడా ఉంది. భారత్ బలమైన జట్టు అని చెప్పడంలో సందేహం లేదు" అని లారా అన్నాడు.

ఇంగ్లాండ్ గట్టి పోటీ
మరోవైపు స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో ఇంగ్లాండ్ సైతం ఈ మెగా టోర్నీలో గట్టి పోటీ ఇస్తుందని లారా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. "ఇంగ్లాండ్ ఫేవరేట్స్ అవునా కాదా అన్న సంగతి నాకు తెలియదు. ఆతిథ్యమిచ్చే దేశం ఏదైనా సరే ఛాంపియన్‌గా నిలవాలని ప్రయత్నిస్తోంది" అని లారా తెలిపాడు.

ఈ టోర్నీ ప్రారంభమైన తర్వాత
"ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ తన అత్యుత్తమ ప్రదర్శన చేసే అవకాశం ఉంది. 1975లో ఈ టోర్నీ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఇంగ్లండ్ ప్రపంచ కప్ గెలుచుకోలేదు. దీంతో ఆ జట్టు ఈ సారి గట్టిగానే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టు కూడా బలంగా ఉంది" అని లారా అన్నాడు.

ఇంగ్లాండ్ మంచి ప్రదర్శనే చేసింది
"గత వరల్డ్‌కప్‌లను పరిశీలిస్తే ఇంగ్లాండ్ మంచి ప్రదర్శనే చేసింది. అయితే, ఇప్పటివరకు ఒక్క వరల్డ్‌కప్‌ను కూడా గెలవలేదు. ఈసారి మాత్రం ఇంగ్లాండ్ బౌండరీని దాటేందుకు సీరియస్‌గా ప్రయత్నించొచ్చు. ఇంగ్లాండ్ జట్టుని పరిశీలిస్తే, క్రికెట్ విమర్శకులు సైతం ఈ విషయాన్ని తప్పకు ఒప్పుకోవాల్సిందే. జట్టులోని అన్ని విభాగాల్లో అద్భుత ఆటగాళ్లు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆ జట్టు ప్రదర్శన అద్భుతం" అని లారా కొనియాడాడు.


Click it and Unblock the Notifications