For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో టాప్-3 కెప్టెన్లను ఎంపిక చేసిన అలెన్ బోర్డర్

ICC World Cup 2019: Border picks Kohli, Morgan, Finch as three skippers to watch out for in WC

హైదరాబాద్: మరో ఐదు రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగుతోన్న జట్లలో టీమిండియా కూడా ఫేవరేట్ ఒకటి. ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ ఫేవరెట్‌ జట్లను వెల్లడిస్తున్నారు. తాజాగా ఆసీస్ లెజెండరీ క్రికెటర్‌ అలెన్‌ బోర్డర్‌ కూడా తన ఫేవరెట్‌ జట్టేదో తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో పాటు ఈ వరల్డ్‌కప్‌లో తనకు నచ్చిన కెప్టెన్ల గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ "కెప్టెన్లలో కోహ్లీ చాలా భిన్నం. చాలా మంది కెప్టెన్లు నెమ్మదిగా ఉండాలని, ప్రశాంతంగా ఆలోచించాలని అంటుంటారు. కానీ, కోహ్లీని తనలోని దూకుడే ఇతర కెప్టెన్ల కంటే తనని భిన్నంగా నిలబెట్టింది"అని అన్నాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గురించి మాట్లాడుతూ "మోర్గాన్ అద్భుత ఆటగాడు. తన చూపు ఎప్పుడూ మ్యాచ్‌ గెలుపుపైనే ఉంటుంది. కాబట్టి అతడిని తక్కువ అంచనా వేయకూడదు" అని అన్నాడు. ఇక, ఇంగ్లాండ్ జట్ట విషయానికి వస్తే ఈ టోర్నీలో మెరుగ్గా ఆడుతుందని అనుకుంటున్నానని అన్నారు.

"ఎందుకంటే వాళ్లు సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని మైదానంలోకి దిగుతున్నారు. ఇంగ్లాండ్‌ జట్టు చాలా ప్రమాదకరమైంది. బ్యాట్స్‌మెన్‌పై కావల్సినంత ఒత్తిడి తెచ్చే బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు" అని అలెన్ బోర్డర్ చెప్పుకొచ్చాడు. ఇక, ఆస్ట్రేలియా గురించి తనదైన శైలిలో స్పందించాడు.

"ఆరోన్‌ ఫించ్‌ తీసుకునే నిర్ణయాలను భలేగా ఉంటాయి. తన పనిని చిత్తశుద్ధితో నిర్వహిస్తాడు. జట్టులో చక్కటి సమన్వయాన్ని తీసుకొస్తాడు. కెప్టెన్‌గా జట్టుకు తానేం చేయాలో అన్ని చేస్తాడు" అని అలెన్ బోర్డర్ అన్నాడు.

Story first published: Saturday, May 25, 2019, 17:44 [IST]
Other articles published on May 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+