ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో టీమిండియా విజయాలను శాసించేది వీళ్లే!

హైదరాబాద్: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ సిద్ధమైంది. మే30 నుంచి ఆరంభమయ్యే ఈ వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్, వేల్స్ ఆతిథ్యమిస్తోంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.... ఇంగ్లాండ్, భారత్ జట్లు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోరి దిగుతున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.
భారత జట్టులోని ప్రతి విభాగంలోనూ అత్యుత్తమ ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిద్దాం....

బెస్ట్ స్పిన్నర్ - కుల్దీప్ యాదవ్
వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో భారత జట్టు విజయాల్లో స్పిన్నర్లు ఎప్పటినుంచో కీలకంగా వ్యవహారిస్తున్నారు. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో భారత జట్టులో ముగ్గురు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజాలను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టులో కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ అరంగేట్రం నుంచి కుల్దీప్ యాదవ్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు భారత్ తరుపున 44 వన్డేలాడిన కుల్దీప్ యాదవ్ 21.75 యావరేజితో 87 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 6/25. ఇక, ఇంగ్లీషు పిచ్‌లపై 3 మ్యాచ్‌లాడిన కుల్దీప్ 9 వికెట్లు తీశాడు.

బెస్ట్ ఫాస్ట్ బౌలర్ - జస్ప్రీత్ బుమ్రా
ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ముగ్గురు పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలతో బరిలోకి దిగుతోంది. ఈ ముగ్గురిలో బుమ్రా అత్యుత్తమ పేసర్. భారత్ తరుపున మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బుమ్రా తన పేస్, వేగంతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్‌కు చెమటలు పట్టిస్తున్నాడు. ఇప్పటివరకు 49 వన్డేలాడిన బుమ్రా 22.15 యావరేజితో 85 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ 5/27.

బెస్ట్ ఆల్ రౌండర్ - హార్ధిక్ పాండ్యా
ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ముగ్గురు ఆల్ రౌండర్లు హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్, రవీంద్ర జడేజాలతో బరిలోకి దిగుతోంది. ఈ ముగ్గురిలో హార్ధిక్ పాండ్యా అత్యుత్తమంగా ఉన్నాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై హార్ధిక్ పాండ్యా అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. 25 ఏళ్ల పాండ్యా భారత్ తరుపున ఇప్పటివరకు 45 వన్డేలాడి 116.59 స్ట్రయిక్ రేట్‌తో 731 పరుగులు చేశాడు. ఇక, బౌలింగ్‌లో 44 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ 3/31.

బెస్ట్ బ్యాట్స్‌మన్ - విరాట్ కోహ్లీ
ఈ టోర్నీలో అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న జట్లలో టీమిండియా ఒకటి. గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ కెరీర్ అత్యున్నత శిఖరాలకు చేరింది. బ్యాట్స్‌మన్‌గా రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్నాడు. కెప్టెన్‌గానూ భారత్‌కు మరపురాని విజయాలు అందిస్తున్నాడు. వన్డేల్లో 11వేల పరుగులను దాటడంతోపాటు ఇప్పటికే ఉన్న 41 సెంచరీలకుతోడు మరి కొన్నింటిని కూడా తన ఖాతాలో వేసుకొనే అవకాశాలున్నాయి. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లాడిన కోహ్లీ 587 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications