For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాకతాళీయంగా పట్టాను: ‘క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ’పై బెన్ స్టోక్స్ (వీడియో)

ICC World Cup 2019: Ben Stokes Takes Stunning Catch During England V South Africa Match!!
ICC World Cup 2019: Ben Stokes on catch of the century

హైదరాబాద్: వరల్డ్‌కప్ మెగా టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో తాను పట్టిన సూపర్ క్యాచ్‌ అంత గొప్పదేమీ కాదని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు. అదిల్‌ రషిద్‌ బౌలింగ్‌లో బౌండరీ వద్ద స్టోక్స్‌ అందుకున్న ఫెలుక్వాయో క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

35వ ఓవర్‌లో

సఫారీ ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. రషీద్‌ బౌలింగ్‌లో ఫెలుక్వాయో బంతిని డీప్‌ మిడ్‌వికెట్ మీదగా ఆడాడు. అదే సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న స్టోక్స్ సూపర్ మ్యాన్‌లా గాల్లో వెనక్కి ఎగురుతూ ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు.

 ‘క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా అభివర్ణన

‘క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా అభివర్ణన

దీనిని పలువురు మాజీ క్రికెటర్లు ‘క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ'గా అభివర్ణించారు. ఈ సందర్భంగా బెన్ స్టోక్స్ మాట్లాడుతూ "ఆ క్యాచ్‌ని కాకతాళీయంగా పట్టాను. నిజానికి ఆ సమయంలో నేను సరైన స్థితిలో లేను. నేను గానీ సరిగ్గా ఉంటే అది మామూలు క్యాచే. అయితే క్యాచ్‌ పట్టినపుడు.. ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు మాత్రం అద్భుతంగా అనిపించాయి" అని తెలిపాడు.

దక్షిణాఫ్రికా ఓటమిలో కీలకపాత్ర

దక్షిణాఫ్రికా ఓటమిలో కీలకపాత్ర

కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా... మూడు విభాగాల్లో రాణించాడు. బ్యాటింగ్‌లో 79 బంతుల్లో 89 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌.. అనంతరం రెండు వికెట్లు, రెండు క్యాచ్‌లు, ఒక రనౌట్‌తో సత్తా చాటాడు.

క్రికెట్‌ చరిత్రలో అతి గొప్ప క్యాచ్‌ల్లో ఒకటిగా

మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అయితే ఈ క్యాచ్‌ను క్రికెట్‌ చరిత్రలో అతి గొప్ప క్యాచ్‌ల్లో ఒకటిగా అభివర్ణించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Saturday, June 1, 2019, 11:42 [IST]
Other articles published on Jun 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+