న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ కొత్త జెర్సీ ఇదే!!

ICC World Cup 2019: BCB unveils Bangladesh jersey for the mega event

మే 30 నుండి ఇంగ్లాండ్ మరియు వేల్స్ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2019 సమరం మొదలు కానుంది. ఇందుకోసం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు 15 మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాయి. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. లండన్‌లోని ఐకానిక్ ది ఓవల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.

ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అందుబాటులో ఉన్న మ్యాచ్‌లలో రాణించాలని కొన్ని జట్లు భావిస్తున్నాయి. మరోవైపు ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని జట్లు శిక్షణా శిబిరాలను ప్రారంభించాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కూడా ఈ నెల 22న శిక్షణా శిబిరాలను ప్రారంభించింది.

అయితే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది. ఈ జెర్సీ ఆకుపచ్చ రంగులో ఉంది. ప్రపంచకప్‌ లోగో కుడివైపున, బీసీబీ లోగో ఎడమ వైపున ఉంది. ఈ కొత్త జెర్సీతోనైనా బంగ్లాదేశ్ రాత మారుతుందో చూడాలి. 1990 నుంచి బంగ్లాదేశ్ ప్రపంచకప్‌ వేటలో ఉన్నా.. ఇప్పటివరకు కప్ సాధించలేదు. అయితే 2003, 2007, 2011లలో బంగ్లాదేశ్ మంచి ప్రదర్శన చేసింది. జూన్ 2న దక్షిణాఫ్రికాతో బాంగ్లాదేశ్ తొలి మ్యాచ్ ఆడనుంది.


బంగ్లాదేశ్ జట్టు:

మొర్తాజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిథన్ దాస్, సౌమ్యా సర్కార్, ముషీఫర్ రహీమ్, షకీబ్ ఉల్ హసన్, మహ్మద్ మిథున్, షబ్బీర్ రెహ్మాన్, మొసద్దిక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహెడీ హసన్ మిరాజ్, రూబెల్ హుస్సెన్, ముస్తఫిజుర్ రెహ్మన్, అబు జాయెద్‌.

Story first published: Tuesday, April 30, 2019, 15:15 [IST]
Other articles published on Apr 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X