కోహ్లీ బ్యాటింగ్ వీడియోలు చూస్తూ: భారత్‌తో మ్యాచ్‌కి సిద్ధమన్న పాక్ బ్యాట్స్‌మన్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వీడియోలు చూస్తూ హై ఓల్టేజ్ మ్యాచ్‌కి తాను సిద్ధమవుతున్నట్లు పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ తెలిపాడు. మాంచెస్టర్ వేదికగా జూన్ 16(ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా-కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బాబర్ అజామ్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో బాబర్ అజామ్ మాట్లాడుతూ "విరాట్ బ్యాటింగ్ వీడియోలు చూస్తుంటా. భిన్న పరిస్థితుల్లో కోహ్లి చేసే బ్యాటింగ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. టీమిండియా తరఫున కోహ్లీ ఎంతగానో విజయవంతమయ్యాడు. నేను కూడా ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా" అని చెప్పుకొచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో
2017లో ఇదే ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాపై పాకిస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌పై బాబర్ ఆజామ్ మాట్లాడుతూ "ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై విజయం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. అప్పుడు ఓడిన భారత జట్టే దాదాపుగా ఇప్పుడూ ఆడుతోంది" అని చెప్పాడు.

పాక్‌పై భారత్ 124 పరుగుల తేడాతో విజయం
రెండేళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ... పైనల్లో మాత్రం 180 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, 1992 నుండి 2015 ప్రపంచకప్ వరకు భారత్, పాక్‌లు ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారతే విజేతగా నిలిచింది.

టీమిండియా రెండు వరుస విజయాలు
టోర్నీలో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించగా గురువారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా... ఐదు పాయింట్లతో భారత్ నాలుగోస్థానంలో కొనసాగుతోంది. పాక్ నాలుగు మ్యాచ్‌లకు గాను రెండింట ఓడి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
{headtohead_cricket_3_5}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications