Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: తుది జట్టులో ఎవరెవరు?: No. 4 స్థానంలో ఆడేదెవరు?

ICC Cricket World Cup 2019 : India’s Probable 11 Man Squad For The ICC World Cup 2019 || Oneindia
ICC World Cup 2019: An Untested No. 4, but India Have Plan B & C in Place for World Cup

హైదరాబాద్:
No. 4 స్థానంలో ఆడేదెవరు?
వరల్డ్ కప్‌లో పేస్ విభాగాన్ని టీమిండియా లైట్ తీసుకుందా?

ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం 15 మందితో కూడిన భారత జట్టుని ప్రకటించిన తర్వాత పైమూడు ప్రశ్నలు సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదిలాయి. వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటించిన తర్వాత కూడా భారత జట్టులో No. 4 స్పాట్ విషయంలో డైలమా కొనసాగుతూనే ఉంది.

వరల్డ్‌కప్‌లో ఆడే తుది జట్టుని ఒక్కసారి పరిశీలిస్తే... టీమిండియా టాపార్డర్‌లో తొలి మూడు స్థానాల్లో... ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే ఎప్పటిలాగే మూడో స్థానంలో విరాట్ కోహ్లీ క్రీజులోకి వస్తాడు. వికెట్ కీపర్‌గా ధోని జట్టులో ఎలాగూ ఉంటాడు కాబట్టి అతడు ఐదో స్థానంలో ఆడతాడు.

ఇంగ్లాండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలం

ఇంగ్లాండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలం

ఇంగ్లాండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలిస్తాయి కాబట్టి జట్టు మేనేజ్‌మెంట్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుంది. దీంతో బుమ్రా, మహ్మద్ షమీలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక, మూడో పేసర్‌గా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సేవలలను కోహ్లీ వినియోగించుకుంటాడు. కాబట్టి పాండ్యా కూడా ఖచ్చితంగా జట్టులో ఉంటాడు. ఎప్పటిలాగే పాండ్యా ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు. ఇక, ఆరో స్థానంలో కేదార్ జాదవ్ ఆడతాడు.

ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను

ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను

ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే కుల్దీప్, చాహల్ రూపంలో ఇద్దరు ఉన్నారు. అలా కాకుండా వీరిద్దరిలో ఒకరిని తీసుకుని మరొకరి స్థానంలో జడేజాను ఆడించొచ్చు. దీంతో అన్ని స్థానాలు ఖాయం అయ్యాయి గానీ... No. 4స్పాట్‌లో ఎవరు ఆడతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఛీఫ్ సెలక్టర్ చెప్పిన మాటలను బట్టి చూస్తే విజయ్ శంకర్‌ను ఆ స్ధానంలో ఆడించే ఆవకాశాలున్నాయి.

విజయ్ శంకర్ ఆల్ రౌండర్ కాబట్టి

విజయ్ శంకర్ ఆల్ రౌండర్ కాబట్టి

విజయ్ శంకర్ ఆల్ రౌండర్ కాబట్టి బౌలింగ్‌లో కూడా అతడి సేవలను వినియోగించుకోవచ్చు. వరల్డ్ కప్‌లో టీమిండియా అసలు మ్యాచ్ ఆరంభానికి ముందు కోహ్లీసేన రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయ్ శంకర్ లేదా కేఎల్ రాహుల్‌లపై జట్టు మేనేజ్‌మెంట్ ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో No. 4 స్థానంలో విజయ్ శంకర్ అయితేనే సరిగ్గా సరిపోతాడని క్రికెట్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

విజయ్ శంకర్ విఫలమైతే

విజయ్ శంకర్ విఫలమైతే

ఒకవేళ విజయ్ శంకర్ విఫలమైతే అతడి స్థానంలో రాహుల్‌ని బరిలోకి దింపే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ చివరగా ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 63 పరుగులు మాత్రమే చేసాడు. ఇందులో రాహుల్ అత్యధిక పరుగులు 26. ఈ పరుగులన్నీ కూడా కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి చేసినవి కావడం విశేషం. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావడం అతడికి కలిసొచ్చింది.

వరల్డ్‌కప్‌లో టీమిండియా తుదిజట్టు:

వరల్డ్‌కప్‌లో టీమిండియా తుదిజట్టు:

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), విజయ్ శంకర్, ధోని, కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

Story first published: Tuesday, April 16, 2019, 15:41 [IST]
Other articles published on Apr 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+