Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా డుప్లెసిస్: వరల్డ్‌కప్‌లో ఆడనున్న దక్షిణాఫ్రికా జట్టిదే

ICC World Cup 2019: Amla edges out Hendricks to make South Africas World Cup squad

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న వన్డే వరల్డ్‌కప్ కోసం ఆయా దేశాలు వరుసగా జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, ఇండియా, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు వరల్డ్ కప్ కోసం జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ మెగా టోర్నీలో పాల్గొనే మొత్తం 15 మందితో కూడిన జట్టుని ప్రకటించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కెప్టెన్‌గా డుప్లెసిస్

దక్షిణాఫ్రికా జట్టుకు సీనియర్ ఆటగాడు డుప్లెసిస్‌ కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. మరో సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లాకు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని భావించిన హెన్‌డ్రిక్స్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.

బౌలర్లు వీరే!

వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన జట్టు టాపార్డర్‌లో డుప్లెసిస్, ఐడెన్ మర్క్రమ్, క్వింటన్ డీకాక్, హషీమ్ ఆమ్లా, జేపీ డుమినిలకు చోటు కల్పించారు. బౌలింగ్ విషయానికొస్తే డేల్ స్టెయిన్, కగిసో రబాడ, ఆండిల్ పెహ్లుక్‌వాయో, లుంగి ఎంగిడి, తబ్రాజ్ షంసీలకు చోటు దక్కింది. మరోవైపు సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్‌‌కి కూడా సెలక్టర్లు చోటు కల్పించారు.

మే30 నుంచి వరల్డ్‌కప్ ఆరంభం

ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఆ జట్టు ధరించబోయే కొత్త జెర్సీలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టు:

డుప్లెసిస్(కెప్టెన్), ఐడెన్ మర్క్రమ్, క్వింటన్ డీకాక్ (వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ పెహ్లుక్‌వాయో, జేపీ డుమిని, డేవాయిన్ ప్రోటోరియస్, డేల్ స్టెయిన్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నార్జే, ఇమ్రాన్ తాహిర్, తబ్రాజ్ షంసీ

Story first published: Thursday, April 18, 2019, 18:24 [IST]
Other articles published on Apr 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+