వరల్డ్‌కప్: విరాట్ కోహ్లీ డ్రీమ్ ప్లేయర్ ఎవరో తెలుసా?

హైదరాబాద్: మరో ఆరు రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే టాప్-10 టీమ్స్ ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టాయి. మే30న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే పది జట్ల కెప్టన్లతో ఐసీసీ గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో వరల్డ్‌కప్ ప్రిపరేషన్, ప్రణాళికలకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు అన్ని జట్లకు చెందిన కెప్టెన్లు సమాధానమిచ్చారు. ఇందులో ఓ ప్రశ్న అందరినీ ఆకట్టుకుంది.

జట్టు కోసం ఓ డ్రీమ్ ప్లేయర్‌ని ఎంచుకోండి
ఆ ప్రశ్న ఏంటంటే... జట్టు కోసం ఓ డ్రీమ్ ప్లేయర్‌ని ఎంచుకోండి. ఈ ప్రశ్నకు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆకట్టుకునే సమాధానమిచ్చాడు. డ్రీమ్ ప్లేయర్‌ని ఎంపిక చేసుకోవడానికి బదులు తాను కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ను ఎంపిక చేసుకుంటానని అన్నాడు.

రికీ పాంటింగ్ కోచ్‌గా
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2019 సీజన్‌లో రికీ పాంటింగ్ కోచ్‌గా వ్యవహారించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాకౌట్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా జట్టుకు కన్సల్టెంట్‌గా వ్యవహారిస్తున్నాడు.

కోహ్లీ ఇలా
ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్ డుప్లిసెస్‌ను తన జట్టులో డ్రీమ్ ప్లేయర్‌గా ఎంపిక చేసుకుంటానని తెలిపాడు. దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌ను తన డ్రీమ్ ప్లేయర్‌గా ఎంపిక చేశాడు.

రబాడను ఎంపిక చేసిన ఆరోన్ ఫించ్
బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తాజా విరాట్ కోహ్లీ తన డ్రీమ్ ప్లేయర్‌గా ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన జట్టులో డ్రీమ్ ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడను ఎంపిక చేశాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే తన జట్టులో బెన్ స్టోక్స్ ఉండాలని కోరుకోగా... కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆప్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎంపిక చేశాడు.

ఎవరినీ ఎంపిక చేయని జాసన్ హోల్డర్
వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ మాత్రం ఎవరినీ ఎంపిక చేయలేదు. ప్రస్తుతం ఉన్న తన జట్టుతో తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక, ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ గులాబ్దిన్ నయిబ్ తెలివిగా సమాధానమిచ్చాడు. తన డ్రీమ్ ప్లేయర్ ఎంపిక అనేది రోజు లేదా పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications