Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే ఓవర్లో మూడు వికెట్లు: లంకపై నబీ సంచలన ప్రదర్శన

ICC World Cup 2019: Afghanistan vs Sri Lanka: Nabi gets 3 in an over to trigger SL collapse

హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో మూడు కీలక వికెట్లు కోల్పోయి శ్రీలంక కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లంక ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి లంకేయులు కష్టాల్లో పడ్డారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ స్పిన్నర్ మహ్మద్ నబీ సంచలన ప్రదర్శన చేశాడు. ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. ఆ ఓవర్‌ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్‌ చేసిన నబీ.. నాలుగో బంతికి కుశాల్‌ మెండిస్‌(2) ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రహ్మత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అదే ఓవర్‌లో ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్‌(0)ను పెవిలియన్‌కు చేర్చాడు.

దీంతో శ్రీలంక 146 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇప్పటివరకు శ్రీలంక కోల్పోయిన నాలుగు వికెట్లు నబీకే దక్కాయి. సంచనాలకు మారుపేరైన ఆప్ఘనిస్థాన్ ఈ మ్యాచ్‌లో విజృంభిస్తోంది. మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. దిముత్‌ కరుణరత్నే- కుశాల్‌ పెరీరాలు తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేశారు.

అయితే, తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అప్ఘనిస్థాన్ స్పిన్నర్‌ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 144/2తో మంచి స్థితిలో ఉన్న శ్రీలంక 149 పరుగులకు గాను 5 వికెట్లు కోల్పోయి భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రస్తుతం 25 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా(72), తిషారా పెరీరా(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Story first published: Tuesday, June 4, 2019, 17:39 [IST]
Other articles published on Jun 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+