వరల్డ్‌కప్: రోహిత్ శర్మ 264 పరుగుల రికార్డుని బద్దలు కొట్టేది వీళ్లే!

హైదరాబాద్: నవంబర్, 2014లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వన్డేల్లో ఆత్యధిక వ్యక్తిగత స్కోరు 264(33 ఫోర్లు, 9 సిక్సులు) నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ చుక్కులు చూపించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, ఆ తర్వాత వన్డే క్రికెట్‌లో పలువురు ఆటగాళ్లు డబుల్ సెంచరీలు బాదినప్పటికీ రోహిత్ శర్మ రికార్డుని మాత్రం బద్దలు కొట్టలేకపోయారు. ప్రస్తుతం 12వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ రికార్డుని బద్దలయ్యే అవకాశం ఉంది.
అందుకు కారణం ఈ మెగా టోర్నీలో క్రికెట్ ప్రేక్షకులను అలరించేందుకు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా పిచ్‌లను రూపొందించారని సమాచారం. దీంతో ఈ టోర్నీలో పరుగుల వరద పారడం ఖాయం. ఇంగ్లాండ్‌లో ఏ మైదానంలో క్రికెట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్యాన్స్‌కు అధికారిక స్కోర్ కార్డులు అమ్మడం ఆనవాయితీ.
ఇప్పటివరకు 400 స్కోర్లకు తగ్గట్లుగా ఆ కార్డులుండేవి. అయితే, ఈసారి ఇంగ్లాండ్ స్టేడియాల్లో మ్యాచ్‌లు ముగిసిన తర్వాత అభిమానులకు అమ్మే స్కోరు కార్డుల్ని '500' మార్కుకు తగ్గట్లుగా రీడిజైన్ చేయించింది. ఇంగ్లాండ్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 3 వికెట్లకు 373 పరుగులు చేయగా... లక్ష్యచేధనలో పాక్ 361 పరుగులు చేసింది.
ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. అయితే, రోహిత్ శర్మ రికార్డుని అందుకోగలిగిన ఆ టాప్-4 ఆటగాళ్లను ఒక్కసారి చూద్దామా...!

డేవిడ్ వార్నర్ - ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఓపెనర్‌గా ఈ వరల్డ్‌కప్‌లో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో వార్నర్ 69.20 యావరేజితో 692 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోనుకోకుండా జట్టుని విజయతీరాలకు చేర్చడంలో వార్నర్‌ది అందవేసిన చేయి. ఆరంభంలో చెలరేగాడంటే వార్నర్‌ను ఔట్ చేయడం చాలా కష్టం. ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డుని అందుకునే ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ కూడా ఒకడు.

మార్టిన్ గుప్టిల్ - న్యూజిలాండ్
నాలుగేళ్ల క్రితం మార్టిన్ గుప్టిల్ చేసిన డబుల్ సెంచరీ(237 నాటౌట్) అభిమానులకు ఇప్పటికీ గుర్తే. 2015 వరల్డ్‌కప్ మార్చి 21న వెస్ట్ ప్యాక్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్టిన్ గుప్టిల్ ఫోర్లు, సిక్సులతో పరుగుల వర్షం కురిపించాడు. మార్టిన్ గుప్టిల్ ఇన్నింగ్స్‌లో 24 పోర్లు, 11 సిక్సులు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి కివీస్ సెమీ పైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు 2019 వరల్డ్‌కప్ వచ్చింది. అయితే, గత కొన్నేళ్లుగా గుప్టిల్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే మాత్రం పరుగుల వరద పారించడం ఖాయం అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

జాసన్ రాయ్ - ఇంగ్లాండ్
ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. అంతేకాదు వన్డేల్లో ఇంగ్లాండ్ జట్టు తరుపున ఓపెనర్‌గా రాణించడం ఇతడికి కలిసొచ్చిన అంశం. 2015 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు జాసన్ రాయ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో వెన్నుముకలాగా తయారయ్యాడు. ఇప్పటివరకు 100కుపైగా యావరేజితో 3,000 పరుగులు సాధించాడు. జాసన్ రాయ్ చివరగా ఆడిన ఐదు వన్డేల్లో 502 పరుగులు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది అంటే బెన్ స్టోక్స్, జో రూట్, ఇయాన్ మోర్గాన్ జాసన్ రాయ్ లాంటి ఆటగాళ్ల వల్లనే. వన్డేల్లో జాసన్ రాయ్ అత్యధిక స్కోరు 180. ఈ పరుగులను కేవలం 45 బంతుల్లో రాబట్టాడు.

క్రిస్ గేల్ - వెస్టిండిస్
వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్. అభిమానులు ముద్దుగా యూనివర్సల్ బాస్ అని పిలుచుకుంటారు. వరల్డ్‌కప్‌కు ముందే ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు వన్డే సిరిస్‌లో 134.17 యావరేజితో 424 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. బౌలర్ల పట్ల 'దయ' అనేది ఉండదు. జింబాబ్వే జట్టుపై డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 39 ఏళ్ల క్రిస్ గేల్‌కు బహుశా ఇది ఆఖరి వరల్డ్‌కప్ కావొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications