Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత్యంత వేగంగా 3వేల పరుగులు: తిరుమన్నే అరుదైన ఘనత

ICC World Cup 2019: 3000 ODI runs for Lahiru Thirimanne

హైదరాబాద్: కార్ఢిఫ్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్‌ లాహిరు తిరిమన్నే అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్‌కప్ మెగా టోర్నీలో భాగంగా ఆప్ఘన్ కెప్టెన్ గుల్బాదిన్‌ నైబ్‌ వేసిన 15 ఓవర్‌ ఐదో బంతిని ఫోర్‌గా మలచడం ద్వారా తిరిమన్నే ఈ ఘనత సాధించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఫోర్‌గా మలచడంతో

తొలుత ఆ బంతి నో బాల్‌ కావడంతో తిరుమన్నేకి ఫ్రీ హిట్‌ ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాతి బంతిని ఫోర్‌గా మలచడంతో వన్డేల్లో మూడు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని అందుకన్న మూడో శ్రీలంక క్రికెటర్‌గా తిరుమన్నే అరుదైన గుర్తింపు పొందాడు.

వందో ఇన్నింగ్స్‌లో

వందో ఇన్నింగ్స్‌లో

తిరిమన్నే తన వందో ఇన్నింగ్స్‌లో 3వేల పరుగుల మైలురాయిని అందుకోగా... ఈ జాబితాలో అతడి కంటే ముందు తరంగా(92 ఇన్నింగ్స్‌లు), ఆటపట్టు(94 ఇన్నింగ్స్‌లు)లు ఉన్నారు. ఇదిలా ఉంటే, అప్ఘనిస్థాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు.

అప్ఘనిస్థాన్‌-శ్రీలంక మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం

అప్ఘనిస్థాన్‌-శ్రీలంక మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం

శ్రీలంక ఇన్నిoగ్స్ 33వ ఓవ‌ర్‌ ముగిసిన తర్వాత అకస్మాత్తుగా వర్షం రావ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది వెంట‌నే మైదానాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పారు. ప్ర‌స్తుతం శ్రీలంక 33 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. క్రీజులో సురంగ లక్మల్‌(2), మలింగ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

టాస్ ఓడి శ్రీలంక బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లంక ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి లంకేయులు కష్టాల్లో పడ్డారు. ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. ఆ ఓవర్‌ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్‌ చేసిన నబీ.. నాలుగో బంతికి కుశాల్‌ మెండిస్‌(2) ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రహ్మత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్‌కు 92 పరుగులు

అదే ఓవర్‌లో ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్‌(0)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో శ్రీలంక 146 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇప్పటివరకు శ్రీలంక కోల్పోయిన నాలుగు వికెట్లు నబీకే దక్కాయి. సంచనాలకు మారుపేరైన ఆప్ఘనిస్థాన్ ఈ మ్యాచ్‌లో విజృంభిస్తోంది. మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. దిముత్‌ కరుణరత్నే- కుశాల్‌ పెరీరాలు తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేశారు.

Story first published: Tuesday, June 4, 2019, 18:35 [IST]
Other articles published on Jun 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+