రేసులో కోహ్లీ ఫస్ట్: 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'ని గెలుచుకునేది వీరే!

హైదరాబాద్: క్రికెటర్లు సత్తా చాటేందుకు వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీకి మించిన స్టేజి మరోకటి ఉండదు. ద్వైపాక్షిక సిరిస్‌లలో ఎన్ని సెంచరీలు చేసినా... వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో సెంచరీలు నమోదు చేస్తే ఆ సెంచరీకి ఉన్న ప్రత్యేకతే వేరు. 2007 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ చేసిన 149 సెంచరీ ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
భారత్‌తో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి మూడోసారి వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు ఇదే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన 98 పరుగులు తన క్రికెట్ కెరీర్‌లోనే మైలురాయి ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది.
ఇక, 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ముంబైలోని వాంఖడె వేదికగా శ్రీలంకతో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (91 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ప్రతి క్రికెట్ అభిమానికీ గుర్తే. ధోని అద్భుత ఇన్నింగ్స్‌తోనే 28 ఏళ్ల తర్వాత టీమిండియా రెండోసారి వరల్డ్‌కప్‌ను నెగ్గింది.
కాగా, మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్లు ఆయా జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ టోర్నీలో మెరుపులు మెరిపించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం సొంతం చేసుకునే అవకాశం ఉంది.
అలాంటి వారెవరో ఒక్కసారి చూద్దాం.....:

విరాట్ కోహ్లీ
మోడ్రన్ క్రికెట్ ఎరాలో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వన్డేల్లో కోహ్లీ ప్రస్తుతం 11,000 పరుగులకు చేరువయ్యాడు. కోహ్లీ గత 50 వన్డే ఇన్నింగ్స్‌లో 3151 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ప్రత్యేకత ఏంటంటే ప్రత్యర్ధి జట్టులోని బౌలర్ గమనాన్ని ముందుగానే అంచనా వేసి కష్టతర షాట్లను కూడా ఈజీగా ఆడేస్తుంటాడు. ఈ వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం సొంతం ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు.

ఆండ్రీ రస్సెల్
ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న 12వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్‌లో వెస్టిండిస్ జట్టు తరుపున ఆండ్రీ రస్సెల్ ట్రంప్ కార్డుగా బరిలోకి దిగుతున్నాడు. ఏ స్థానంలోనైనా చెలరేగి ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ని గెలిపించగల ఆటగాడు. ఒత్తిడి నెలకొన్న సమయాల్లో కూడా అలవోకగా సిక్సులు బాదగలడు. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే తన బౌన్సింగ్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించగలడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో రస్సెల్ కేకేఆర్ తరుపున 204.81 స్ట్రయిక్ రేట్‌తో 510 పరుగులు చేశాడు. ఇందులో 52 సిక్సులు ఉన్నాయి.

డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఓపెనర్‌గా ఈ వరల్డ్‌కప్‌లో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో వార్నర్ 69.20 యావరేజితో 692 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోనుకోకుండా జట్టుని విజయతీరాలకు చేర్చడంలో వార్నర్‌ది అందవేసిన చేయి. ఆరంభంలో చెలరేగాడంటే వార్నర్‌ను ఔట్ చేయడం చాలా కష్టం. ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఈ మెగా టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం సొంతం చేసుకున్న ఆటగాళ్లలో వార్నర్ కూడా ఒకడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications