
హైదరాబాద్: నాటింగ్ హామ్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు పాకిస్థాన్ 21.4 ఓవర్లకు 105 పరుగులకు ఆలౌటైంది. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుని నమోదు చేసిన జట్టుగా నిలిచింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
1992 వరల్డ్‌కప్‌లో అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులకే ఆలౌటైంది. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. అయితే, శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఈ 74 పరుగుల రికార్డుని పాక్ అధిగమిస్తుందని అంతా భావించారు. అయితే, చివర్లో వాహబ్ రియాజ్ 11 బంతుల్లో 18 (1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో పాక్ వంద పరుగుల మార్కుని దాటింది.
పాకిస్థాన్ జట్టులో ఫకార్ జమాన్ (22), బాబర్ ఆజామ్ (22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్(2) పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో జట్టు స్కోరు 17 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8) వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. విండీస్ బౌలర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొవడంలో విఫలమయ్యారు. విండిస్ జట్టులో థామస్ నాలుగు వికెట్లు తీయగా జాసన్ హోల్డర్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
{headtohead_cricket_5_8}
ఇక, వరల్డ్‌కప్‌లో అతి తక్కువ ఓవర్లలో ఆలౌట్ అయిన జట్ల విషయానికి వస్తే ఈ జాబితాలో బంగ్లాదేశ్ ముందుంది. 2011 ఢాకా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత 2007లో కింగ్‌స్టన్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది.