ముంబై: ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పైన భారత్ 'సిక్సర్' విజయం నేపథ్యంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ స్పందించారు. భారత్ చక్కని విజయం సాధించిందని, నేనేం చేశానో తెలియదని పేర్కొన్నారు. మా ఇంటి బయట అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని, వారితో చేరాలని అనిపిస్తోందని పేర్కొన్నారు. పాక్ పైన గెలుపు నేపథ్యంలో యువరాజ్ సింగ్ కూడా స్పందించారు.
పలువురు క్రికెటర్లు స్పందించారు. భజ్జీ ట్వీట్ చేస్తూ.. వెల్ డన్ బాయ్స్, పాకిస్తాన్ పైన ప్రపంచ కప్ రెండో రోజు గ్రేట్ విన్ అన్నారు. ఇలాగే కొనసాగించాలన్నారు. కోహ్లీ, రైనా, శిఖర్ ధావన్ బ్యాటింగ్, షమీ బౌలింగ్ సూపర్ అన్నాడు. యువరాజ్ స్పందిస్తూ.. వెల్ డన్ బాయ్స్.. కోహ్లీ బాగా ఆడాడు అన్నారు. భారత్‌ది గొప్ప విజయమని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశారు. వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాకు కాంగ్రాట్స్ చెప్పారు.
కోహ్లీ ఏమన్నాడు..
తన ముందు ఏదైనా సవాల్ ఉన్నప్పుడు దాని పైనే దృష్టి పెడతానని, మిగతా వాటి గురించి పట్టించుకోనని భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ కోహ్లీ అన్నాడు. పాక్ పైన గెలిచిన అనంతరం అతను మాట్లాడాడు. పాక్‌తో మ్యాచ్ అంటే తమ పైన అంచనాలు తారాస్థాయిలో ఉంటాయని, తాము గెలవాలని అంతా కోరుకుంటారన్నారు.

ఓటమిని ద్వేషిస్తానని, గెలుపును ప్రేమిస్తానని చెప్పారు. బ్యాట్స్‌మెన్‌గా మంచి ఇన్నింగ్స్ నిర్మించడం తన బాధ్యత అన్నాడు. శిఖర్ ధావన్, సురేష్ రైనా లాంటి హిట్టర్లు విజృంభించడంతో తన పని సులువయిందన్నాడు. రైనా బ్యాటింగ్ బాగుందని, మొత్తానికి ఇది గుడ్ బ్యాటింగ్ షో అన్నాడు.