Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసిసి ప్రపంచ కప్ సెమీ ఫైనల్ జట్లు: షెడ్యూల్

వెల్లింగ్టన్‌: ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్స్‌లో పోటీ జట్లు ఖరారయ్యాయి. న్యూజిలాండ్ చివరగా సెమీ ఫైనల్‌కు చేరిన జట్ల జాబితాలో చేరింది. న్యూజిలాండ్ శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. 143 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది.

సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను అక్లాండ్‌లో ఈ నెల 24వ తేదీన తలపడనుంది. ప్రపంచ కప్ పోటీల్లో న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ఏడోసారి. వరుసగా మూడోసారి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శననివారం జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ 250 పరుగులకు ఆలౌట్ అయి ఇంటి దారి పట్టింది.

శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి దక్షిణాఫ్రికా మిగతా జట్ల కన్నా ముందు ఈ నెల 8వ తేదీన సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత గురువారంనాడు ఈ నెల 19వ తేదీన భారత్ బంగ్లాదేశ్‌పై 109 పరుగుల తేడాతో సునాయస విజయం సాధించింది. సెమీ ఫైనల్‌లోకి అడుగు పెట్టిన రెండో జట్టు భారత్.

ICC World Cup 2015 Semi-final Teams, Schedule

శుక్రవారంనాడు ఈ నెల 20వ తేీదన ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. ఆస్ట్రేలియా, భారత్ ఈ నెల 26వ తేదీన సెమీ ఫైనల్ మ్యాచులో తలపడనున్నాయి.

సెమీ ఫైనల్‌కు చేరుకున్న నాలుగు జట్లలో ఇప్పటి వరకు ఏ మ్యాచులోనూ ఓడిపోని జట్లు భారత్, న్యూజిలాండ్. ఈ రెండు జట్లు కూడా వరుసగా ఏడేసి మ్యాచుల్లో విజయం సాధించాయి.

సెమీ ఫైనల్ షెడ్యూల్

సెమీ ఫైనల్ 1 (మార్చి 24, మంగళవారం) ఆక్లాండ్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30, ఈడెన్ పార్క్ వేదిక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడుతాయి.

సెమీ ఫైనల్ 2 (మార్చి 26, గురువారం) సిడ్నీలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు, సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

ఫైనల్ (మార్చి 29, ఆదివారం) మెల్బోర్న్‌లో, భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+