అవన్నీ అవాస్తవం, అన్నింటా ఆడుతా: క్రిస్ గేల్ ప్రకటన
వెల్లింగ్టన్: తాను ఏ ఫార్మెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించలేదని వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ శనివారం చెప్పాడు. గేల్ సుమారు ఏడాది కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే త్వరలోనే స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అతను దూరమయ్యాడు.
ఫిట్నెస్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అతను టెస్టు ఫార్మెట్ నుంచి రిటైర్ అవుతాడని వార్తలు వచ్చాయి. దీనిపై గేల్ స్పందించాడు. అలా వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పాడు. తాను అన్ని ఫార్మెట్స్‌లోనూ ఆడతానని, దేని నుంచి రిటైర్ కాలేదని న్యూజిలాండ్‌తో క్వార్టర్ ఫైనల్స్ ముగిసిన అనంతరం చెప్పాడు.

వచ్చే ఏడాది జరిగే ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీలకు తాను అందుబాటులోనే ఉంటానని తెలిపాడు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని చెప్పాడు. ఫిట్నెస్ సమస్య నుంచి త్వరలోనే తాను బయటపడతానని క్రిస్ గేల్ ధీమా వ్యక్తం చేశాడు.
కాగా, క్వార్టర్ ఫైనల్లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ 143 పరుగుల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడినప్పటికీ.. క్రిస్ గేల్ తనదైన శైలిలో ఆడి అలరించాడు. అతను గేల్ 33 బంతుల్లో 8 సిక్స్‌లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications