ఇస్లామాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేజేతులా మ్యాచ్ కోల్పోయిందా? అంటే పాక్ విశ్లేషకులు అవుననే అంటున్నారు. మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ వదిలేయడంతో పాటు... పాక్ వ్యూహాలు దెబ్బతీశాయని అంటున్నారు.
కెప్టెన్ మిస్బా ఉల్ హక్ టాస్ కోల్పోవడంతోనే పాకిస్తాన్ సగం ఓడింది. భారీ లక్ష్యఛేదన క్రమంలో మేనేజ్‌మెంట్ సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్‌ను ఓపెనర్‌గా పంపింది. ఈ ఎత్తుగడ దారుణంగా బెడిసికొట్టిందంటున్నారు. భారీ అంచనాలతో క్రీజ్‌లోకి వచ్చిన యూనిస్ కేవలం 6 పరుగులు చేసి ఔటయ్యాడు.

దీంతో, మిడిలార్డర్లో మిస్బా మినహా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు బ్యాట్స్‌మెన్లు లేకుండా పోయారు. దానికి తోడు భారత బౌలర్ల విరుచుకు పడ్డారు. దీంతో బౌలర్లను అడ్డుకట్ట వేయడం పాక్ మిడిలార్డర్ వల్ల కాలేదు. ఓవైపు కెప్టెన్ మిస్బా ఒంటరిపోరాటం చేస్తున్నా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు.
మరో విషయం ఈ మ్యాచ్‌లో పాక్ తరపున భారీ భాగస్వామ్యాలు లేవు. టి20 ఫార్మాట్‌ను మినహాయిస్తే, మిగతా ఫార్మాట్లలో భారీ భాగస్వామ్యాలే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తాయి. దీనిపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. వికెట్ కీపర్ ఉమర్ అక్మల్.. కోహ్లీ క్యాచ్ వదిలేయడాన్ని తప్పు పట్టాడు. దీనికి తమ జట్టు మూల్యం చెల్లించుకుందన్నాడు. జావెద్ మియందాద్ కూడా ఈ ఎక్స్‌పరిమెంట్‌ను తప్పుపట్టాడు.