Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

28కే... చైనాకు ఘోర అవమానం: జడెజా ఆసక్తికర ట్వీట్!

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ క్వాలిఫయర్‌ - ఆసియా మ్యాచ్‌లు థాయ్‌లాండ్‌లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సౌదీ అరేబియా ప్రత్యర్థి జట్టు అయిన చైనాపై 390 తేడాతో విజయం సాధించింది.

టోర్నీలో భాగంగా శనివారం చైనా-సౌదీ అరేబియా మధ్య 50 ఓవర్ల మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌదీ అరేబియా నిర్ణీత ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది.

సౌదీ అరేబియా బ్యాట్స్‌మెన్లు మహ్మద్‌ ఆఫ్జల్ (120, 100బంతుల్లో), షోయబ్‌ అలీ (91, 41బంతుల్లో) అద్భుతంగా రాణించారు. చైనా ఆటగాడు ఫెంగ్‌ యు 5 వికెట్లు తీశాడు.

ICC World Cricket League: China bowled out for 28 by Saudi Arabia

అనంతరం 419పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా జట్టు తడబడింది. ఓపెనర్లు లూ(3), జుయాంగ్‌(6), మరో ఆటగాడు జాంగ్‌ పెంగ్‌(6) మాత్రమే పరుగుల ఖాతా తెరిచారు. మిగిలిన ఆటగాళ్లెవరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాటపట్టారు.

ఎక్స్‌ట్రాల రూపంలో 13పరుగులు వచ్చాయి. చివర్లో జియాంగ్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగడంతో 12.4 ఓవర్లలో చైనా కేవలం 28 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సౌదీ జట్టు 390 పరుగుల తేడాతో గెలిచింది.

2004లో శ్రీలంక - జింబాబ్వే జట్ల మధ్య జరిగిన వన్డేలో జింబాబ్వే 35 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు చైనా అంతకంటే తక్కువ స్కోర్ చేసింది. 2007లో అండర్ -19 క్రికెట్లో వెస్టిండీస్ - బార్పడోస్ మధ్య జరిగిన మ్యాచులో (అండర్ 19) వెస్టిండీస్ కేవలం పద్దెనిమిది పరుగులే చేసింది.

చెనాను సౌదీ అరేబీయా 390 పరుగులతో ఓడించింది.

సౌదీ అరేబియా: 418/10 (50 ఓవర్లు)
చైనా: 28 పరుగులకే ఆలౌట్ (12.4 ఓవర్లు)

జడెజా ఆసక్తికర ట్వీట్

సౌదీ అరేబియా చేతిలో చైనా ఘోరంగా ఓడిపోవడంపై రవీంద్ర జడెజా ఆసక్తికర ట్వీట్ చేశారు. వారి స్కోర్ పెట్టి.. ఆ తర్వాత చైనా వస్తువులు ఎక్కువ కాలం మన్నలేవు అని పేర్కొన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+