Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's U19 T20 World Cup 2025: మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మలేషియాలో జరగబోయే ICC U19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటించింది. టోర్నమెంట్ 2025 జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ ఫైనల్ ఫిబ్రవరి 2 న జరగనుంది.ఈ ఈవెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొనున్నాయి. నాలుగు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి షెడ్యూల్ ప్రకటించారు. నాలుగు వేదికలలో 16 రోజుల వ్యవధిలో 41 మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

జట్లు ప్రధాన ఈవెంట్‌కు సిద్ధం కావడానికి జనవరి 13 నుంచి 16 వరకు 16 వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడనున్నాయి. ఆతిథ్య మలేషియా U19 మహిళల T20 ప్రపంచ కప్‌లో మొదటిసారి అరంగేట్రం చేస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్‌ను వెస్టిండీస్, శ్రీలంక, మలేషియాతో పాటు గ్రూప్ Aలో ఉంచారు. జనవరి 19న వెస్టిండీస్‌తో ఇండియా తలపడనుంది. ఈ టోర్నమెంట్ జనవరి 18న ప్రారంభ రోజున మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.

ICC Women s Under-19 T20 World Cup 2025 schedule released

ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ vs ఐర్లాండ్, సమోవా vs ఆఫ్రికా క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అక్కడ వారు ఒక్కొక్కటి ఆరు జట్లతో రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ A, గ్రూప్ D లలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఒక సూపర్ సిక్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే గ్రూప్ B, గ్రూప్ C యొక్క మొదటి మూడు జట్లు మరో గ్రూప్ విభజిస్తారు.

జట్లు తమ పాయింట్లు, నెట్ రన్ రేట్‌లను గ్రూప్ దశ నుంచి సూపర్ సిక్స్‌లోకి వెళ్తాయి. సూపర్ సిక్స్ లో ప్రతి గ్రూప్‌ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. భారత్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తే, వారు సెమీ-ఫైనల్ 2 ఆడతారు. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నమెంట్ ఇండియా ఫైనల్స్‌లో ఇంగ్లండ్ పై గెలిచి కప్ కొట్టిది. ICC U19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 లో అన్ని నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కూడా షెడ్యూల్ చేశారు. ఫిబ్రవరి 1 రెండు సెమీ ఫైనల్‌లకు రిజర్వ్ డేగా ఉంచారు. ఫైనల్‌కు ఫిబ్రవరి 3న రిజర్వ్ డే ఉంటుంది.

మలేషియాతో పాటు థాయ్‌లాండ్ ఈవెంట్‌కు సహ-హోస్ట్‌గా ఉండాల్సి ఉంది. కానీ థాయ్ లాండ్ తప్పుకోవడంతో మలేషియాను ఈవెంట్‌కు ఏకైక హోస్ట్‌గా నిలిచింది.

ICC మహిళల U19 ప్రపంచ కప్ 2025 గ్రూపులు
గ్రూప్ A - భారత్ (A1), వెస్టిండీస్ (A2), శ్రీలంక (A3), మలేషియా (A4)

గ్రూప్ B - ఇంగ్లండ్ (B1), పాకిస్థాన్ (B2), ఐర్లాండ్ (B3), USA (B4)

గ్రూప్ C - న్యూజిలాండ్ (C1), దక్షిణాఫ్రికా (C2), ఆఫ్రికా క్వాలిఫైయర్ (C3), సమోవా (C4)

గ్రూప్ D - ఆస్ట్రేలియా (D1), బంగ్లాదేశ్ (D2), ఆసియా క్వాలిఫైయర్ (D3), స్కాట్లాండ్ (D4)

Story first published: Sunday, August 18, 2024, 17:29 [IST]
Other articles published on Aug 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+