చరిత్ర సృష్టించిన పసికూన.. న్యూజిలాండ్‌పై సంచలన విజయం!
మలేషియా వేదికగా జరుగుతోన్న అండర్-19 ప్రపంచ కప్‌లో సంచలన విజయం నమోదైంది. తాజాగా జరిగిన మ్యాచులో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ జట్టును ఓడించి నైజీరియా జట్టు చరిత్ర సృష్టించింది. రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. కాగా, అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో నైజీరియా జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. దీంతో మ్యాచ్ పూర్తి కాగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంతోషంతో గెంతులేస్తూ మైదానం అంతటా పరుగులు పెట్టారు నైజీరియా అమ్మాయిలు.
అంతరాయం కల్గించిన వర్షం
నైజీరియా - న్యూజిల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం అంతరాయం కలిగించడం వల్ల మ్యాచును 13 ఓవర్లకు కుదించారు నిర్వాహకులు. ఈ పోరులో మొదట బ్యాటింగ్ కు దిగిన నైజీరియా మహిళల జట్టు నిర్ణీత 13 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన న్యూజిలాండ్ మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 63 పరుగులకే పరిమితమైంది. అయితే ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో లిలియన్ ఉదేహా అద్భుత ప్రదర్శన చేసింది. తన బౌలింగ్ మ్యాజిక్ తో కట్టడి చేసి, జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.

కాగా, ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోరాడుతోంది బలమైన జట్టుతోనైనా.. నిర్దేశించింది స్వల్ప లక్ష్యమే అయినా.. విజయం కోసం నైజీరియా మహిళలు పోరాడిన తీరు ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ గా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ మహిళలు ఓడిపోవడంతో విజయం నైజీరియాను వరించింది.
🚨 HISTORY IN U-19 WORLD CUP 🚨
— Johns. (@CricCrazyJohns) January 20, 2025
- NIGERIA DEFEATED NEW ZEALAND BY 2 RUNS, A HISTORIC MOMENT IN CRICKET.
Incredible emotions after the win by Nigeria. pic.twitter.com/00OqhP6MnP
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications