
ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. కాసేపటి క్రితమే ఐసీసీ తన వెబ్ సైట్లో కంప్లీట్ షెడ్యూల్ విడుదల చేసింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ టోర్నీ జరగబోతుంది. ఫిబ్రవరి, 10న న్యూలాండ్స్‌లో తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక మధ్య జరగనుంది. మొత్తం టాప్ 10 జట్లు టోర్నీలో తలపడనున్నాయి. 15 రోజుల పాటు కేప్ టౌన్, పార్ల్, జెబెర్హా వేదికలుగా 23మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాలు ప్రారంభం అవుతున్నట్లు కూడా ఐసీసీ పేర్కొంది. ఫిబ్రవరి, 26న న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆఫ్రికన్ వేడుకలతో ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. టిక్కెట్ల ధరలు 60 ర్యాండ్లు (275రూపాయలు) నుండి ప్రారంభమవుతాయి. ఆరేళ్లలోపు పిల్లలకు ఫ్రీ టికెట్. బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈ ఈవెంట్లో పాల్గొంటాయి. ఐసీసీ అంబాసిడర్ మిథాలీ రాజ్ కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా రానుంది.
షెడ్యూల్ :
10 ఫిబ్రవరి, , దక్షిణాఫ్రికా v శ్రీలంక, కేప్ టౌన్
11 ఫిబ్రవరి, వెస్టిండీస్ v ఇంగ్లాండ్, పార్ల్
11 ఫిబ్రవరి, ఆస్ట్రేలియా v న్యూజిలాండ్, పార్ల్
12 ఫిబ్రవరి, భారత్ v పాకిస్థాన్, కేప్ టౌన్
12 ఫిబ్రవరి, బంగ్లాదేశ్ v శ్రీలంక, కేప్ టౌన్
13 ఫిబ్రవరి, ఐర్లాండ్ v ఇంగ్లాండ్, పార్ల్
13 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా v న్యూజిలాండ్, పార్ల్
14 ఫిబ్రవరి, ఆస్ట్రేలియా v బంగ్లాదేశ్, జెబెర్హా
15 ఫిబ్రవరి, వెస్టిండీస్ v ఇండియా, కేప్ టౌన్
15 ఫిబ్రవరి, పాకిస్థాన్ v ఐర్లాండ్, కేప్ టౌన్
16 ఫిబ్రవరి, శ్రీలంక v ఆస్ట్రేలియా, జెబెర్హా
17 ఫిబ్రవరి, న్యూజిలాండ్ v బంగ్లాదేశ్, కేప్ టౌన్
17 ఫిబ్రవరి, వెస్టిండీస్ v ఐర్లాండ్, కేప్ టౌన్
18 ఫిబ్రవరి, ఇంగ్లండ్ v ఇండియా, జెబెర్హా
18 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా v ఆస్ట్రేలియా, జెబెర్హా
19 ఫిబ్రవరి, పాకిస్తాన్ v వెస్టిండీస్, పార్ల్
19 ఫిబ్రవరి, న్యూజిలాండ్ v శ్రీలంక, పార్ల్
20 ఫిబ్రవరి, ఐర్లాండ్ v ఇండియా, జెబెర్హా
21 ఫిబ్రవరి, ఇంగ్లాండ్ v పాకిస్థాన్, కేప్ టౌన్
21 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా v బంగ్లాదేశ్, కేప్ టౌన్
23 ఫిబ్రవరి, సెమీ-ఫైనల్ 1, కేప్ టౌన్
24 ఫిబ్రవరి, రిజర్వ్ డే కేప్ టౌన్
24 ఫిబ్రవరి, సెమీ-ఫైనల్ 2, కేప్ టౌన్
25 ఫిబ్రవరి, రిజర్వ్ డే కేప్ టౌన్
26 ఫిబ్రవరి, ఫైనల్, కేప్ టౌన్
27 ఫిబ్రవరి, రిజర్వ్ డే కేప్ టౌన్