For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ సెమీస్‌ ప్రత్యర్థి: దక్షిణాఫ్రికానే ముద్దు.. ఇంగ్లండ్ వద్దు!!

ICC Womens T20 World Cup 2020: Who is the best semis opponent for Teamindia

మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే భారత్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-'ఎ'లో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. వరుస నాలుగు విజయాలతో గ్రూప్-'ఎ' టాపర్‌గా భారత్ ఉంది. ఇక గ్రూప్‌-బి నుంచి ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా నాకౌట్‌కు అర్హత పొందాయి.

దక్షిణాఫ్రికా గెలిస్తే:

దక్షిణాఫ్రికా గెలిస్తే:

మంగళవారం చివరి లీగ్ మ్యాచ్‌లో విండీస్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపోటములను బట్టి భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోనుంది. దక్షిణాఫ్రికా గెలిస్తే 8 పాయింట్లతో అగ్రస్థానంకు వస్తుంది కాబట్టి భారత్‌కు ఇంగ్లండ్ ప్రత్యర్థి అవుతుంది. ఒకవేళ ఓడిపోతే దక్షిణాఫ్రికాతోనే భారత్‌ సెమీస్‌ ఆడుతుంది. అయితే సెమీస్‌లో హర్మన్‌ సేన తలపడేది బలమైన ఇంగ్లాండ్‌తోనా? లేదా సంచలనాల దక్షిణాఫ్రికాతోనా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

దక్షిణాఫ్రికాపై భారత్‌ ఆధిపత్యం:

దక్షిణాఫ్రికాపై భారత్‌ ఆధిపత్యం:

భారత్ సెమీస్‌ ప్రత్యర్థి దక్షిణాఫ్రికా అయితేనే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దక్షిణాఫ్రికాపై భారత్‌ ఆధిపత్యం చూపడమే అసలు కారణం. రెండు జట్లు 10 టీ20ల్లో తలపడగా.. భారత్‌ 7 గెలిచి 2 ఓడింది. విజయాల శాతం 77.77. గతేడాది దక్షిణాఫ్రికాను హర్మన్‌సేన 3-1తో ఓడించింది. ఆంగ్లేయులను దక్షిణాఫ్రికా ఓడించినప్పటికీ.. ప్రొటీస్ క్రికెటర్లు అంత ఫామ్‌లో లేరు.

ఇంగ్లండ్ అత్యంత ప్రమాదకారి:

ఇంగ్లండ్ అత్యంత ప్రమాదకారి:

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్ అత్యంత ప్రమాదకారి. అందుకే.. మరో సెమీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడితేనే మేలు. ఇక ఆంగ్లేయులతో టీమిండియా 19 టీ20ల్లో తలపడగా.. కేవలం 4 గెలిచి ఏకంగా 15 ఓడిపోయింది. విజయాల శాతం 21.05 మాత్రమే. గతేడాది మార్చిలో ఇంగ్లాండ్‌ గువాహటిలో పర్యటించి హర్మన్‌ సేనను 0-3తో వైట్‌వాష్‌ చేసింది. ఇక ప్రపంచకప్‌ ముందు జరిగిన ముక్కోణపు సిరీసులోని 2 మ్యాచుల్లో పైచేయి సాధించింది.

దక్షిణాఫ్రికాతో ఆడడమే తేలిక:

దక్షిణాఫ్రికాతో ఆడడమే తేలిక:

ప్రపంచకప్‌లో ఇంగ్లిష్ క్రికెటర్లు బంతి, బ్యాటుతో రాణిస్తున్నారు. నటాలీ సివర్‌ 4 మ్యాచుల్లో 67.33 సగటుతో 202, హేథర్‌ నైట్‌ 64.33 సగటుతో 193 పరుగులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. షెఫాలీ వర్మ (161)ది మూడో స్థానం. బౌలింగ్‌ విభాగంలోనూ భారత్‌, ఇంగ్లాండ్‌ ఆధిపత్యమే. పూనమ్‌ యాదవ్‌ (9), సోఫీ ఎక్లెస్టన్‌ (8), అన్య ష్రబ్‌సోల్‌ (8), శిఖ పాండే (7), సారా గ్లెన్‌ (6) టాప్‌-10లో ఉన్నారు. ఈ లెక్కలు అన్ని చూస్తే.. ఇంగ్లిష్ జట్టుతో కంటే దక్షిణాఫ్రికాతో ఆడడమే మనకు కాస్త తేలిక.

బ్యాటింగ్‌ లైనప్‌ మెరుగవ్వాలి:

బ్యాటింగ్‌ లైనప్‌ మెరుగవ్వాలి:

విశ్వ టోర్నీలో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన భారత్ నాకౌట్‌లో ఎలా తలపడుతుందో చూడాలి. యువ ఓపెనర్‌ షెఫాలీ వర్మ దూకుడుగా ఆడుతోంది. జెమీమా రోడ్రిగ్స్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ పరుగులు చేస్తోంది. ఇక సీనియర్లు స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌, వేద కృష్ణమూర్తి తేలిపోతున్నారు. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బంతి, బ్యాటుతో ఫామ్‌లో ఉంది. బౌలింగ్‌ పరంగా ఎలాంటి ఇబ్బందేమీ లేదు. ఇక మెరుగవ్వాల్సింది బ్యాటింగ్‌ లైనప్‌ మాత్రమే.

Story first published: Monday, March 2, 2020, 20:59 [IST]
Other articles published on Mar 2, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+