Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women U19 world cup: బౌలర్లు భళా.. టీమిండియా శుభారంభం

అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు శుభారంభం చేశారు. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

ఈ పోరులో మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్.. భారత బౌలర్ల దెబ్బకు 13.2 ఓవర్లలోకే చేప చుట్టేశారు. 44 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలారు. విండీస్ బ్యాటర్లలో అసబి క్యాలెండర్ (20 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 12), కెనికా కాసర్ (29 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సాయంతో 15 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. సమరా రామ్ నాథ్, అమృత రామ్ తహాల్ సహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. టీమ్‌ఇండియా బౌలర్లలో పరుణికా సిసోదియా 3 వికెట్లు తీయగా.. జోషిత 2, ఆయుషి శుక్లా 2 వికెట్లు పడగొట్టారు.

ICC Women s U19 World Cup 2025 India Women beats West Indies by 9 Wickets

అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని మన అమ్మాయిలు 4.2 ఓవర్లలోనే ఊదేశారు. ఒక వికెట్ కోల్పోయి సునాయసంగా ఛేదించారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష (2 బంతుల్లో 4, 1 ఫోర్ ) నిరాశ పరిచింది. ఆ తర్వాత కమిలిని (13 బంతుల్లో 16*.. 3 ఫోర్లు ), సానికా చాల్కే (11 బంతుల్లో 18*.. 3 ఫోర్లు) పరుగులు సాధించారు. జోషితా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుంది.

భారత అమ్మాయిల జట్టు
గొంగడి త్రిష, జి కమలిని (వికెట్ కీపర్), సానికా చాల్కే, నికి ప్రసాద్ (కెప్టెన్), భావికా అహిరే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత, పరుణికా సిసోడియా, షబ్నమ్ షకీల్, సోనమ్ యాదవ్

వెస్టిండీస్ జట్టు

అసబి క్యాలెండర్, సమారా రామ్‌నాథ్ (కెప్టెన్), నైజాని కంబర్‌బ్యాచ్, జహజారా క్లాక్స్‌టన్, బ్రియానా హరిచరణ్, కెనికా కాసర్, అబిగైల్ బ్రైస్, క్రిస్టెన్ సదర్లాండ్ (వికెట్ కీపర్), అమృతా రామ్‌తహల్, అమియా గిల్బర్ట్, సెలీనా రాస్

Story first published: Sunday, January 19, 2025, 14:36 [IST]
Other articles published on Jan 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+