Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ వరల్డ్ టీ20: ఫైనల్‌కు చేరే ఆ రెండు జట్లు ఏవో తెలుసా?

ICC Womens world Twenty20: india, england, australia or west indies who will be the finals berth

హైదరాబాద్: కరేబియన్ దీవుల్లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. 10 జట్లతో ప్రారంభమైన మహిళల టీ20 వరల్డ్‌కప్‌‌ తుది దశకు చేరుకుంది. నాలుగు జట్లు టైటిల్ రేస్‌లో మిగిలాయి. గ్రూప్ దశ పోటీలు ముగియడంతో సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది.

గ్రూప్-ఏ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ గ్రూప్-బీ నుంచి ఇండియా, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. భారత్, వెస్టిండీస్ జట్లు అంచనాలకు మించి రాణించి గ్రూప్ దశను ఓటమంటూ లేకుండా ముగించాయి. ఇండియా, విండీస్ జట్లు తమ నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి గ్రూప్ స్టేజిలో అగ్రస్థానంలో నిలిచాయి.

8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో

8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో

గ్రూప్‌-బిలో భారత్ మహిళల వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక, ఆస్ట్రేలియా 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దీంతో గ్రూప్‌-ఏలో వెస్టిండిస్ మహిళల జట్టు వరుస విజయాలతో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా ఇంగ్లాండ్‌ 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా

మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా

దీంతో మూడు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరుగనుంది. సెమీస్‌ను అధిగమిస్తే భారత్ ఫైనల్‌కు చేరడం ఖాయం. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా ఈ వరల్డ్ టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్ బెర్త్‌పై కన్నేసింది. దీనికి తోడు భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

ఇంగ్లాండ్‌‌ను ఓడించడం పెద్ద కష్టం కాదు

ఇంగ్లాండ్‌‌ను ఓడించడం పెద్ద కష్టం కాదు

ఇదే ఫామ్‌ను ప్రదర్శిస్తే రెండో సెమీఫైనల్‌‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌‌ను ఓడించడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాగా, ఆస్ట్రేలియా ఇప్పటివరకూ మూడు సార్లు మహిళల వరల్ట్ టీ20 ఛాంపియన్‌గా నిలవగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఓ సారి ఈ ఫార్మాట్‌లో విశ్వవిజేతలుగా నిలిచాయి. భారత్ మాత్రం ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకోలేకపోయింది.

ఓటమి అంటూ లేని ఇండియా, వెస్టిండీస్

ఓటమి అంటూ లేని ఇండియా, వెస్టిండీస్

ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో జరుగుతున్న టోర్నీలో ఇప్పటివరకు ఓటమి అంటూ లేని ఇండియా, వెస్టిండీస్ జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. అంతేకాదు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ జరగడం ఖాయమని మరికొందరు అంచనా వేస్తున్నారు.

 ఐసీసీ వరల్డ్ టీ20 సెమీఫైనల్స్ షెడ్యూల్:

ఐసీసీ వరల్డ్ టీ20 సెమీఫైనల్స్ షెడ్యూల్:

తొలి సెమీఫైనల్ - వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా (యాంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియం)

రెండో సెమీఫైనల్ - ఇండియా vs ఇంగ్లండ్ (యాంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియం)

Story first published: Tuesday, November 20, 2018, 19:13 [IST]
Other articles published on Nov 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+