Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరేబియన్ గడ్డపై టీ20 వరల్డ్‌కప్: భారత్ బోణీ చేసేనా?

ICC Womens World T20: Calm Harmanpreet Kaur hopes to inspire young team

హైదరాబాద్: కరేబియన్ గడ్డపై ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ మెగా టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టు శుక్రవారం రాత్రి 8.30 గంటలకి న్యూజిలాండ్‌తో తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

ఇప్పటి వరకు ఐదుసార్లు టీ20 వరల్డ్ ‌‌కప్‌లో ఆడిన భారత్ జట్టు కనీస ఒక్కసారి కూడా ఫైనల్‌కి చేరలేకపోయింది. దీంతో ఈసారి టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు భావిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత జట్టు బలంగా కనిపిస్తోంది.

టోర్నీలో మొత్తం 10 జట్లు

టోర్నీలో మొత్తం 10 జట్లు

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్, వేద కృష్ణమూర్తి, పూనమ్‌ యాదవ్‌ తదితరులు భారత విజయాల్లో కీలకపాత్ర పోషించనున్నారు. టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 10 జట్లని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్- ఎ‌లో వెస్టిండిస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఉన్నాయి.

గ్రూప్-బిలో భారత్

గ్రూప్-బిలో భారత్

గ్రూప్-బిలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. నవంబర్ 24న టోర్నీ ఫైనల్ జరగనుండగా ఒకే గ్రూపు‌లో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం (నవంబర్ 11)న తలపడనున్నాయి. 2009లో జరిగిన తొలి మహిళల టీ20 వరల్డ్ కప్‌ను చార్లెట్ ఎడ్వర్డ్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది.

హ్యాట్రిక్ టైటిల్స్‌తో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా

హ్యాట్రిక్ టైటిల్స్‌తో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా

ఆ తర్వాత జరిగిన మూడు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియా జట్టు హ్యాట్రిక్ టైటిల్స్‌తో చరిత్ర సృష్టించింది. 2010, 2012, 2014 టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడు టైటిల్స్ సాధించి అరుదైన ఘనత సాధించింది. ఇక, 2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో వెస్టిండిస్ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియానే ఓడించి తొలి సారిగా ఈ ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా అవతరించింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ

తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ "గతంలో నేను మైదానంలో చాలా దూకుడుగా వ్యవహరించేదాన్ని. ఇప్పుడు సహనంతో ఎలా ఉండాలో నేర్చుకున్నా. జట్టులో యువ క్రికెటర్లు ఎక్కువమంది ఉన్నారు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో వారికి మద్దతుగా నిలుస్తూ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తాను" అని తెలిపారు.

Story first published: Friday, November 9, 2018, 18:34 [IST]
Other articles published on Nov 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+