వరల్డ్ కప్: ఫైనల్లో భారత్, వెల్లువెత్తిన శుభాకాంక్షలు
హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో సూపర్ సెంచరీతో టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన హర్మన్ ప్రీత్ కౌర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. గురువారం డెర్బీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌కు ముందు వరకు 76 వన్డేల్లో 33.38 యావరేజితో 1803 పరుగులు చేసిన కౌర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ని ఆడింది. ఈ సందర్భంగా అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు భారత క్రికెటర్లు సోషల్ మీడియాలో కౌర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్ తరుపున వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాట్స్ ఉమెన్‌గా దీప్తిశర్మ(188 నాటౌట్) తర్వాత కౌర్ నిలిచింది.
సచిన్ టెండూల్కర్
'అద్భుతమైన ఫినిషింగ్. ఈ చిత్రమే అన్నీచెబుతోంది. ఇక లార్డ్స్‌లో రాణించాలి' అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.
విరాట్ కోహ్లీ
భారత కెప్టెన్ కోహ్లీ ‘వాట్ ఏ ఇన్నింగ్స్ కౌర్.. బౌలర్ల ప్రదర్శన అద్భుతమని' ట్వీట్ చేశాడు.
సంజయ్ మంజ్రేకర్
సింగిల్ హ్యాండ్‌తో గెలిపించే మ్యాచ్‌లు చూసి చాల రోజులైందని సంజయ మంజ్రేకర్ కౌర్ ప్రదర్శనను కొనియాడాడు.
వీరేంద్ర సెహ్వాగ్
కౌర్ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్.. అద్భుతమైన హిట్టింగ్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
రవిశాస్త్రి
కౌర్ రాక్ స్టార్ అని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.
మహమ్మద్ కైఫ్
మహిళల ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ అని కైఫ్ కౌర్‌ను కొనియాడాడు.
వీవీఎస్ లక్ష్మణ్
'మిథాలీ సేనకు అభినందనలు. జట్టు ప్రదర్శన అద్భుతం. ఎంతో గర్వంగా ఉంది. ఫైనల్స్‌కి గుడ్‌లక్' అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
ఇషాంత్ శర్మ
'రెండో సెమీఫైనల్లో అద్భుత విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత మహిళల జట్టుకి అభినందనలు. 171 పరుగుల హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ అత్యద్భుతం' అని ఇషాంత్ శర్మ ట్వీట్ చేశాడు.
యూసఫ్ పఠాన్
'భారత జట్టు అద్భుత విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ మరుపురానిది. అమ్మాయిలు ఇక ట్రోఫీని దక్కించుకోండి' అని యూసఫ్ పఠాన్ ట్వీట్ చేశాడు.
కేఎల్ రాహుల్
'ఫైనల్ చేరుకున్న భారత మహిళల జట్టుకి శుభాకాంక్షలు. జట్టు కలిసికట్టుగా మంచి ప్రదర్శన చేసింది. ఇంటికి కప్పు తీసుకువచ్చేందుకు ఇక ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది' కేఎల్ రాహుల్ ట్వీట్ చేశాడు.
గౌతమ్ గంభీర్
'ప్రపంచకప్ సెమీఫైనల్లో జట్టు కనబరిచిన ప్రదర్శన అద్భుతం. ట్రోఫీని అందుకోవడానికి ఎంతో దూరంలో లేము' అని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు.
కపిల్ దేవ్
'ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో మీ ప్రదర్శన చూసి ఎంతో గర్వపడుతున్నా. ఘన విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ మరిచిపోలేనిది' అని కపిల్ దేవ్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications