Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్మన్ ప్రీత్ భారీ సిక్సుల వెనుక ఉన్న రహస్యం ఇదే

హైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ సూపర్ ఇన్నింగ్స్ అందరికి గుర్తుండే ఉంటుంది. టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ బౌలర్లను కౌర్ ఉతికి ఆరేసింది. ఆసీస్‌పై 115 బంతుల్లో 7 సిక్సులు, 20 ఫోర్లతో 171 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

రెండో అత్యుత్తమ స్కోరు

రెండో అత్యుత్తమ స్కోరు

తద్వారా వన్డేల్లో భారత్ తరఫున రెండో అత్యుత్తమ స్కోరును నమోదు చేసుకుంది. మరి దీని వెనుక అసలు కారణమేంటో కౌర్ బుధవారం బయటపెట్టింది. చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో కలిసి ఆడటమే తాను దూకుడుగా ఆడేందుకు కలిసొచ్చిందని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది.

దూకుడుగా బ్యాటింగ్ చేయడమంటే ఇష్టం

దూకుడుగా బ్యాటింగ్ చేయడమంటే ఇష్టం

'చిన్నతనం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఇష్టపడేదాన్ని. ఈ క్రమంలో కుర్రాళ్లతో కలిసి మ్యాచ్‌లు ఆడేదాన్ని. అందుకే వారి శైలిలో భారీ సిక్స్‌లు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటా. వ్యక్తిగత స్కోర్లపై ఎప్పుడు దృష్టిపెట్టింది లేదు. జట్టు కోసం ఆడటాన్నే ఇష్టపడుతా' అని హర్మన్ చెప్పింది.

షాట్లు ఆడటం మొదలుపెట్టా

షాట్లు ఆడటం మొదలుపెట్టా

ఇక లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో హర్మన్‌ ప్రీత్‌ వికెట్టే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. హర్మన్ అవుటైన తర్వాతే భారత్‌ తడబడి ఓటమి వైపు పయనించింది. దీనిపై హర్మన్‌ మాట్లాడుతూ 'ఆ సమయానికి పరుగుల వేగం పెంచాల్సి ఉంది. అందుకే షాట్లు ఆడటం మొదలుపెట్టా. నేను అవుటైన షాట్‌ ఫీల్డర దగ్గరికి వెళ్తుందని అనుకోలేదు' అని తెలిపింది.

ఆసీస్‌పై తన ప్రదర్శన మరిచిపోలేనిది

ఆసీస్‌పై తన ప్రదర్శన మరిచిపోలేనిది

దేశవాళీ క్రికెట్‌లో దూకుడుగా ఆడటంతోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం వచ్చిందని అయితే పెద్ద స్కోర్లు చేయలేదని హర్మన్ చెప్పుకొచ్చింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై తన ప్రదర్శన మరిచిపోలేనిదని ఈ మ్యాచ్‌ ప్రసారం కావడం అందరూ చూడటం మరింత సంతోషాన్ని ఇచ్చిందని కౌర్‌ ఆనందం వ్యక్తం చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Harmanpreet's little secret
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+