ఉమెన్ వరల్డ్ కప్: ఆసీస్‌పై టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?
హైదరాబాద్: మిథాలీ రాజ్ నేతృత్వంలోనే భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో మిథాలీ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే 2005 తర్వాత వరల్డ్ కప్‌లో మరోసారి ఫైనల్ చేరినట్లవుతుంది.
ఈ టోర్నీలో లీగ్ దశలో భారత్ 5 విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 6 గెలిచింది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు జరిగితే, భారత్ 34 ఓడి, 8 మాత్రమే గెలిచింది. ఆసీస్ కఠినమైన ప్రత్యర్థే అయినా ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
గతంలో మాదిరి మిథాలీ రాజ్, ఝలన్ గోస్వామి, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి ఇద్దరు ముగ్గురి మీదే భారత్ ఆధారపడే పరిస్థితి లేదు. జట్టులో చాలామంది మ్యాచ్ విన్నర్లు తయారయ్యారు. గ్రూప్ దశలో భారత్ తరఫున చక్కటి వ్యక్తిగత ప్రదర్శనలు నమోదయ్యాయి. గ్రూప్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌ల్లో మిథాలీసేన విజయం సాధించింది.

జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన మిథాలీ
ఇక సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 186 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించడంతో భారత్ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా రెట్టింపు చేసింది. గ్రూప్ దశ తొలి రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన చక్కటి ఇన్నింగ్స్‌లతో భారత్‌ను గెలిపించింది. మిథాలీ ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది.

భారత్‌కు ఇబ్బందికరంగా మారిన స్మృతి మందాన ఫామ్
ఇక ఓపెనర్ స్మృతి మందాన ఫామ్ భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. తొలి రెండు మ్యాచ్‌లలో 90, 106 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత వరుసగా 2, 8, 4, 3, 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆమె తప్పక రాణించాల్సి ఉంది. ఆసీస్‌పైనే సెంచరీ చేసిన పూనమ్ రౌత్ మరో భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టింది.

ఫామ్‌లో హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి
హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మల సహకారం కూడా జట్టు ముందంజ వేయడంలో ఉపయోగపడింది. వీరంతా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో మరోసారి స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ కీలకం కానుంది. న్యూజిలాండ్‌పై ఆమె ఒంటిచేత్తో విజయం అందించింది. 2016 ఫిబ్రవరిలో భారత్ ఆఖరిసారి ఆసీస్‌ను ఓడించినప్పుడు రాజేశ్వరి 2 కీలక వికెట్లు పడగొట్టింది.

ఆసీస్ ప్రధాన బలం అదే
ఇక ప్రధాన పేసర్లు ఝలన్, శిఖా పాండే మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే గ్రూప్ దశలో వేర్వేరు మ్యాచ్‌ల్లో రాణించిన వీళ్లు, సెమీఫైనల్లో సమష్టిగా సత్తా చాటితే భారత్ విజయం సాధించడం ఖాయం. ఇక ఆస్ట్రేలియా జట్టులో 9వ స్థానం వరకు కూడా బ్యాటింగ్ చేయగల ప్లేయర్లు ఉండటమే ఆ జట్టుకు బలం.

ఎలీస్ పెర్రీ అద్భుత ప్రదర్శన
టోర్నీలో సంయుక్తంగా ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు సాధించిన ఓపెనర్లు బెథ్ మూనీ, నికోల్ బోల్టన్ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఎలీస్ పెర్రీ అద్భుత ప్రదర్శన ఆసీస్‌ను దూసుకుపోతోంది. టోర్నీలో 366 పరుగులు చేయడంతో పాటు ఆమె 9 వికెట్లు తీసింది. బౌలర్లు మేగన్ షట్, ఆష్లీ గార్డ్‌నర్, జెస్ కూడా చక్కటి ఫామ్‌లో ఉన్నారు.

జట్ల వివరాలు (అంచనా)
భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖా పాండే, సుష్మ వర్మ, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), మూనీ, బోల్టన్, ఎలీస్ పెర్రీ, విలాని, బ్లాక్‌వెల్, హీలీ, ఆష్లీ గార్డ్‌నర్, జొనాసెన్, మెగాన్ షుట్, క్రిస్టన్ బీమ్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications