Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మోగాలో సంబరాలు: కౌర్ తండ్రి ఇలా, ఆడపిల్లల్ని చంపొద్దన్న తల్లి

హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో సూపర్ సెంచరీతో టీమిండియాను హర్మన్ ప్రీత్ కౌర్‌ ఫైనల్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. టీమిండియా ఫైనల్లోకి దూసుకెళడంతో పంజాబ్‌లోని మోగాలో ఆమె కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

పరస్పరం స్వీట్లు పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్లో కూడా భారత్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో హర్మన్ ప్రీత్ కౌర్ తండ్రి మీడియాతో మాట్లాడాడు. ఫైనల్లో కూడా హర్మన్ ప్రీత్ కౌర్ రాణించాలని ఆమె తండ్రి కోరుకున్నాడు.

ICC Women's World Cup: 'Hopefully, Harmanpreet will continue to shine'

భారత్‌ ప్రపంచకప్‌ గెలవాలని, జాతి గర్వించాలని ఆయన పేర్కొన్నాడు. ఆడపిల్లలు సాధికారత సాధించేలా ప్రోత్సహించాలని ఆయన అన్నాడు.

'ఆమె (హర్మన్ ప్రీత్ కౌర్) చిన్నప్పటి నుంచి చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి. టీనేజ్ వయసులోనే ఆమె అభిరుచిని గమనించి క్రీడలను ఆమె కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సహించాం. తాను కన్న కలలను నిజం చేసుకునే విధంగా అద్భుత ప్రదర్శన చేసింది' అని మోగాలోని జిల్లా కోర్టులో క్లర్క్‌గా పనిచేస్తున్న కౌర్ తండ్రి పేర్కొన్నాడు.

'టోర్నీలో హర్మన్‌ వేలికి గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైంది. ఆ సమయంలో హర్మన్‌ చాలా బాధపడింది. ఇప్పుడు ఆ బాధ నుంచి కోలుకుంది. మా కుమార్తెకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి భారత్‌ కప్పు గెలవాలని కోరుకుంటున్నా' అని ఆయన అన్నాడు.

హర్మన్‌ ప్రీత్‌ తల్లి సతీందర్‌ కౌర్‌ ఉద్వేగంగా మాట్లాడారు. 'మహిళలందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. మా కుమార్తె మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసింది. మీరందరు కూడా మీ కుమార్తెలను వారి వారి కలల్లో జీవించేందుకు అవకాశం ఇవ్వండి. దయచేసి ఆడపిల్లల్ని కడుపులోనే చంపేయకండి' అని అన్నారు. పంజాబ్‌లోని మోగాకు చెందిన క్లబ్‌ స్థాయి క్రికెటర్‌ అయిన తండ్రి హర్మీందర్‌ సింగ్‌ భుల్లర్‌ ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు.

ముగ్గురు పిల్లల్లో పెద్దదైన హర్మన్‌ ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ కాదనలేదు. కౌర్‌ కెరీర్‌ను తీర్చి దిద్దడంలో స్థానిక కోచ్‌ కమల్దిష్‌ సింగ్‌ అన్నింటా తానై కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే హర్మన్‌ప్రీత్‌ ఇన్నింగ్‌ను వర్ణించడానికి మాటలు రావడం లేదని మహిళల క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీ అన్నారు. పురుషుల క్రికెట్‌లోనూ ఇలాంటి ఇన్నింగ్స్‌ అరుదుగా చూస్తుంటామని అభిప్రాయపడ్డారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Dad elated
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+