వరల్డ్ కప్ ఫైనల్: మిథాలీ రికార్డు, లార్డ్స్‌లో చరిత్ర 'రిపీట్' అవుతుందా?
హైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. ఇంగ్లాండ్ మాత్రం మూడుసార్లు వరల్డ్ కప్‌ను (1973, 1993, 2009) గెలుచుకుంది. 2005లో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. మళ్లీ ఇప్పుడు ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఫైనల్ మ్యాచ్ జరిగే లార్డ్స్ మైదానం గురించి మనం ఒక్కటి గుర్తు చేసుకోవాలి. 1983లో ఇదే స్టేడియం ఓ చరిత్రకు వేదిక అయింది. కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా తొలిసారి భారత్‌కు వరల్డ్ కప్ అందించింది. అప్పుడు పురుషుల జట్టును ఈ స్టేడియం హీరోలని చేస్తే... ఇప్పుడు మహిళల జట్టును మిథాలీసేనను ఏం చేస్తోందో చూడాలి మరి.
2005లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ టోర్నీలో మిథాలీ రాజ్ సారథ్యంలోనే టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరింది. అయితే అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు, ఇప్పుడు మిథాలీనే టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం. అప్పుడు ఆడిన జట్టులో మిథాలీ, జులన్ గోస్వామి మాత్రమే సభ్యులు.

మిగతా వారికి ఇదే తొలి ఫైనల్
మిగతా వారికి ఇదే తొలి ఫైనల్. భారత్, ఇంగ్లండ్‌లు పోరాటంలో సమఉజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్‌లో ఇరు జట్ల క్రికెటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లూ అదరగొడుతున్నారు. అంతేకాదు అప్పటితో పోలిస్తే భారత జట్టు ఎంతో బలంగా ఉంది. జట్టులో చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం భారత జట్టులో ఆత్మ విశ్వాసాన్ని పెంచేవే.

ఇంగ్లాండ్ పుంజుకున్న తీరు అమోఘం
లీగ్ దశలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమి పాలైనా ఆ తర్వాత ఆ జట్టు పుంజుకున్న తీరు అమోఘం. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అగ్రస్థానంతో గ్రూప్ దశను ముగించింది. భారత్‌ను లీగ్ దశలో చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికాపైనే సెమీస్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ గత ఏడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం.

టోర్నీలో ఎక్కువ పరుగులు
అంతేకాదు టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం. టామీ బ్యూమాంట్ (387 పరుగులు), హెదర్ నైట్ (363), సారా టేలర్ (351) మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ ఫైనల్ చేరడంలో వీరే కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌కు భారత అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశముంది.

ముఖాముఖి పోరులో
ఇక ఇరు జట్ల ముఖాముఖి విషయానికి వస్తే భారత్‌పై ఇంగ్లండ్‌దే పైచేయి. మొత్తంగా ఇరు జట్లు ఇప్పటివరకు 62 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 26 మ్యాచ్‌లు గెలిస్తే, ఇంగ్లండ్ 34 విజయాలు సాధించింది. రెండింటిలో ఫలితం రాలేదు. భారత్ అత్యధిక స్కోరు 281 అయితే, ఇంగ్లండ్ అత్యధిక స్కోరు 272.

లార్డ్స్ మైదానంలో మూడు సార్లు
ఇక ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా... భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచాయి. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా... చెరో మ్యాచ్‌లో గెలిచాయి. మరో మ్యాచ్ రద్దు అయింది. కెప్టెన్ హోదాలో రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న తొలి భారతీయ క్రికెటర్‌గా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది.

తుది జట్లు (అంచనా)
భారత్: పూనమ్ రౌత్, స్మృతి మంధానా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, సుష్మా వర్మ (వికెట్‌కీపర్), జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్/ఏక్తా బిస్త్
ఇంగ్లాండ్: లారెన్ విన్‌ఫీల్డ్, టామీ బ్యూమాంట్, హెదర్ నైట్ (కెప్టెన్), సారా టేలర్, నటాలీ షీవర్, ఫ్రాన్ విల్సన్, కేథరిన్ బ్రంట్, జెన్నీ గున్, లారా మార్ష్, అన్య ష్రబ్‌సోల్, అలెక్స్ హార్ట్‌లీ
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్షప్రసారం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications