కప్ గెలవాలని పూజలు, హోమాలు: మిథాలీ సేనకు దిగ్గజాల 'ఆల్ ద బెస్ట్'
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. ఇంగ్లాండ్ మాత్రం మూడుసార్లు వరల్డ్ కప్‌ను (1973, 1993, 2009) గెలుచుకుంది.
2005లో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. మళ్లీ ఇప్పుడు ఫైనల్‌కు అర్హత సాధించింది. 2005లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ టోర్నీలో మిథాలీ రాజ్ సారథ్యంలోనే టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరింది. అయితే అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది.
అప్పుడు, ఇప్పుడు మిథాలీనే టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం. అప్పుడు ఆడిన జట్టులో మిథాలీ, జులన్ గోస్వామి మాత్రమే జట్టు సభ్యులుగా ఉన్నారు. వరల్డ్ కప్ టైటిల్‌కు అడుగు దూరంలో ఉన్న మిథాలీసేన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి దేశానికి వరల్డ్ కప్ తీసుకురావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మిథాలీసేనకు పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు భారత క్రికెట్ అభిమానులు దేశంలోని పలు చోట్ల ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. మిథాలీ సేన విజయాన్ని కాంక్షిస్తూ వారణాసిలో అభిమానులు భారీ హోమం నిర్వహించారు.
హోమగుండం చుట్టూ జాతీయ జెండాలను చేతపట్టుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అభిమానులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీమిండియా ఫొటోలను చేతిలో పట్టుకొని ప్రత్యేకంగా హోమం నిర్వహించారు.
విరాట్ కోహ్లీ
భారత మహిళా జట్టుకు గుడ్ లక్ విషెస్ చెప్పిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
మహేంద్ర సింగ్ ధోని
ఐసీసీ ఉమెన్ వరల్డ్ ఫైనల్‌కు చేరిన మిథాలీ సేనకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
వీరేంద్ర సెహ్వాగ్
అమ్మాయిలు ఎప్పుడూ మనల్ని గర్వించేలా చేస్తారు. రేపటి ఫైనల్స్‌కు ఆల్ ద బెస్ట్ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
సునీల్ గవాస్కర్
మిథాలీ సేనకు ఆల్ ద బెస్ట్ చెప్పిన క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.
బీసీసీఐ
పైనల్‌కు చేరిన మిథాలీ సేనకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
వీవీఎస్ లక్ష్మణ్
భారత మహిళల జట్టుకు ఆల్ ద బెస్ట్ చెప్పిన టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.
సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేక సైకతశిల్పం
పూరీ తీరాన సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేక సైకతశిల్పాన్ని రూపొందించి మిథాలీ సేనకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications